కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. ఏకంగా రూ. 62 వేలు తగ్గిన పసిడి!

బంగారం, వెండి ప్రియులకు భారీ ఊరటనిస్తూ బులియన్ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచబోతోందన్న అంచనాల నేపథ్యంలో బుధవారం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న తరుణంలో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఓ సువర్ణావకాశంగా మారింది. జనవరి నాటి రికార్డు గరిష్ట స్థాయిలతో పోలిస్తే బంగారం ఇప్పటివరకు దాదాపు రూ.62 వేలు తగ్గగా.. వెండి ఏకంగా రూ.2.57 లక్షల మేర దిగిరావడం గమనార్హం.

పసిడి ధరలు పాతాళానికి- మరో మహా పతనం: 14 నెలల కనిష్టానికి
పసిడి ధరలు పాతాళానికి- మరో మహా పతనం: 14 నెలల కనిష్టానికి

ఎంసీఎక్స్ మార్కెట్లో భారీ పతనం
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బుధవారం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచే విలువైన లోహాలపై అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ఫలితంగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.3,200(2.38 శాతం) తగ్గి రూ.1,31,027 వద్దకు చేరుకుంది. ఇక వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తూ ఒక్క రోజే కిలోపై రూ.5,900(3.47 శాతం) పతనమై రూ.1,63,818 వద్ద ట్రేడవుతోంది.

Gold and Silver Prices Crash Gold Drops Rs 62 000 From Record High Amid US Fed Rate Hike Fears

దేశీయ బులియన్ మార్కెట్లో నేటి ధరలు ఇలా..
ఢిల్లీ, ముంబై సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన బులియన్ మార్కెట్లలోనూ ధరలు భారీగా తగ్గాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. బుధవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.3,000 తగ్గి రూ.1,31,505 వద్ద స్థిరపడింది. అలాగే ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.2,900 మేర క్షీణించి రూ.1,20, 459 వద్దకు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,629 వద్ద కొనసాగుతుండగా.. కిలో వెండి ధర రూ.4,400 తగ్గి రూ.1,64,506 వద్దకు దిగివచ్చింది.

వామ్మో.. పసిడి రేట్లు ఇలా పడిపోతున్నాయేంటీ
వామ్మో.. పసిడి రేట్లు ఇలా పడిపోతున్నాయేంటీ

రికార్డు స్థాయి నుంచి అనూహ్యంగా కిందకు..
ఈ ఏడాది ఆరంభంలో ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు రికార్డు గరిష్టాల నుంచి భారీగా కిందకు దిగివచ్చాయి. జనవరి నెలలో 10 గ్రాముల బంగారం ధర ఆల్-టైమ్ రికార్డు స్థాయి అయిన రూ.1.93 లక్షలకు చేరుకుని కొనుగోలుదారులను బెంబేలెత్తించింది. అక్కడి నుంచి ఇప్పటివరకు ఏకంగా రూ.62,000 తగ్గి రూ.1.31 లక్షల స్థాయికి పడిపోయింది. అదేవిధంగా గతంలో కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.4.20 లక్షల మార్కును తాకింది. అక్కడి నుంచి చూస్తే ఇప్పటివరకు ఏకంగా రూ.2.57 లక్షలు తగ్గి ప్రస్తుతం రూ.1.63 లక్షల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే తరహా పతనం నమోదైంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్సు బంగారం 2.15 శాతం క్షీణించి 3,780.40 డాలర్లకు, ఔన్సు వెండి 3.15 శాతం తగ్గి 45.865 డాలర్లకు చేరుకుంది.

ధరలు ఎందుకు పడిపోతున్నాయి? నిపుణుల అంచనా ఏంటి?
డిసెంబర్లో జరగనున్న కీలక సమావేశంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డే రేట్లను పెంచే అవకాశం ఉందని, భవిష్యత్తులో మరిన్ని పెంపులు ఉండొచ్చని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే సూచనలు ఉండటంతో ఫెడ్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు పెరిగితే అమెరికా బాండ్ మార్కెట్ పుంజుకుని డాలర్ మరింత బలపడుతుంది. ఫలితంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనాలుగా భావించే బంగారం, వెండి నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని బాండ్ల వైపు మళ్లుతున్నారు. దీనికి తోడు నేడు ఫెడ్ నుంచి మరికొన్ని కీలక ప్రకటనలు వెలువడనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణ్లు విశ్లేషిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+