పసిడి ధరలు పాతాళానికి- మరో మహా పతనం: 14 నెలల కనిష్టానికి

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మరో భారీగా పతనం నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు పసిడిని దెబ్బకొడుతోన్నాయి. వీటి రేట్లు గత 14 నెలల కనిష్ఠ స్థాయికి సమీపంలో కొనసాగుతున్నాయి. దాదాపుగా రెండువారాలుగా బంగారం ధరలు పతనమౌతూనే ఉన్నాయి. కొనేవారిలో జోష్ కనిపిస్తోన్నా, ఇప్పటికే అధిక రేట్లకు వీటిని కొన్నవాళ్లు భారీగా నష్టపోవాల్సి వస్తోంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో మంగళవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఏకంగా 2,780 రూపాయల మేర పడిపోయింది. 22 క్యారెట్లల్లో రూ. 2,550, 18 క్యారెట్లల్లో 2,090 రూపాయలు మేర దిగజారాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2,540 తగ్గి రూ.1,31,300 వద్ద నమోదు కాగా, ఆభరణాల తయారీకి ఎక్కువగా వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాములు ప్రస్తుతం రూ.1,20,275 వద్ద ట్రేడ్ అయింది.

Gold and silver rates tumbled at MCX hovering near a 14-month low and silver extending its losses

ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లలోనూ ప్రతికూల ట్రెండ్ కనిపించింది. డిసెంబర్ పసిడి ఫ్యూచర్స్ ధర 1.88 శాతం తగ్గి రూ.1,31,700 వద్ద, వెండి ఫ్యూచర్స్ 2.96 శాతం నష్టపోయి రూ.1,64,687 వద్ద నమోదయ్యాయి. వెండి ధరలో కూడా ఇదే పతనం కనిపించింది. కేజీ వెండి ధర రూ.5,100 పడిపోయింది. రూ.1,65,400కి చేరుకుంది.

ఇంత తక్కువ పర్స్ బ్యాలెన్స్ తో ఎవర్ని కొందామని.. !!
ఇంత తక్కువ పర్స్ బ్యాలెన్స్ తో ఎవర్ని కొందామని.. !!

అటు అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లలోనూ పసిడి, వెండి ధరలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ స్పాట్ గోల్డ్ ధర 1.35 శాతం క్షీణించి ఔన్సుకు 3,797 డాలర్ల వద్ద కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ ధర 2.67 శాతం తగ్గి ఔన్సుకు 46 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి వస్తున్న కఠిన ద్రవ్య విధాన వ్యాఖ్యలే ఈ పతనానికి ప్రధాన కారణమని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ ప్రతినిధి మానవ్ మోదీ తెలిపారు.

తమిళనాడు మీదుగా శబరిమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక
తమిళనాడు మీదుగా శబరిమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,32,290 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,21,266 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,32,080 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. రూ. 1,21,073 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,32,460, రూ.1,21,422 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,32,380, 22 క్యారెట్లు రూ. 1,21,348 వద్ద కొనసాగుతున్నాయి.

వామ్మో.. పసిడి రేట్లు ఇలా పడిపోతున్నాయేంటీ
వామ్మో.. పసిడి రేట్లు ఇలా పడిపోతున్నాయేంటీ

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,326, 22 క్యారెట్లు - రూ. 12,215, 18 క్యారెట్లు - రూ. 10,000

ముంబై..

24 క్యారెట్లు- రూ. 13,326, 22 క్యారెట్లు - రూ. 12,215, 18 క్యారెట్లు - రూ. 9,994

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 13,326, 22 క్యారెట్లు - రూ. 12,215, 18 క్యారెట్లు - రూ. 9,994

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 13,326, 22 క్యారెట్లు - రూ. 12,215, 18 క్యారెట్లు - రూ. 9,994

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 13,326, 22 క్యారెట్లు - రూ. 12,215, 18 క్యారెట్లు - రూ. 9,994

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 13,326, 22 క్యారెట్లు - రూ. 12,215, 18 క్యారెట్లు - రూ. 9,994

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+