వాస్తు ప్రకారం ఆర్థికంగా కలిసిరావాలంటే ఏం చేయాలి?

వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్నిరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చికాకులు, గొడవలు.. జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలకు వాస్తులోపమని భావించి కొంతమంది భారీగా మార్పుచేర్పులు చేస్తుంటాయి. అయితే ఆర్థికంగా కలిసిరావాలంటే వాస్తు ప్రకారం కొన్ని సూచనలు, వాస్తు నిపుణుల సలహాలు పాటించాలి. అటువంటప్పుడు కొంత స్థితి మెరుగవుతుంది.

నగదు, బంగారం లాంటివి దాచుకునే బీరువాకానీ, లాకర్ కానీ నైరుతి మూలలో ఉండాలి.
బీరువా తలుపులు తెరిస్తే అవి ఉత్తరం వైపు తెరుచుకోవాలి.
ఉత్తరం కుబేరుడి దిశ. సంపద కలిసివస్తుంది.
బీరువాను ఎప్పుడూ బీమ్ కింద కానీ, మెట్ల కింద కానీ లేదా బాత్‌రూమ్ గోడకు కానీ ఆనించకూడదు.

Vastu Tips According to Principles what steps should be taken to achieve financial prosperity

ఉత్తర దిశలో కుబేరుడు ఉంటాడు కాబట్టి ఈ దిశను శుభ్రంగా, ఖాళీగా ఉంచాలి.
భారీ వస్తువులు, చెత్తాచెదారం ఉంచకూడదు.
ఇక్కడ ఒక నీటి ఫౌంటెన్ లేదా చిన్న అక్వేరియం ఉంచాలి.
దీనివల్ల ధన ప్రవాహం పెరుగుతుంది.

ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ ఆకర్షణీయంగా, వెలుతురుతో నిండి ఉండాలి.
గుమ్మానికి రెండు వైపులా స్వస్తిక్ గుర్తు లేదా ఓం గుర్తు వేయాలి.
విరిగిన తలుపులు, శబ్దం చేసే కీచుమనే తలుపులు
ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి వాటికి వెంటనే మరమ్మతులు చేయించాలి.

వంటగది ఆగ్నేయ మూలలో ఉండాలి.
కుళాయిలు లీకవకూడదు.
నీరు వృథాగా పోతుంటే డబ్బు వృథా అవుతుంది.

ఇంటి లోపల ఉత్తర దిశలో మనీ ప్లాంట్‌ను పెంచాలి.
మీ లాకర్ లోపల చిన్న అద్దం ఉంచాలి.
లాకర్ ఎదురుగా అద్దం ఉంటే సంపద రెట్టింపు అవుతుంది.
ఈశాన్యంలో తులసి మొక్క పెంచాలి.
సాయంత్రం వేళ ఇక్కడ దీపం వెలిగించాలి.
లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
ఇంటిని ఎంత శుభ్రంగా, కళకళలాడేలా చూసుకుంటారో అంతగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+