T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ?
భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిచ్చిన టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026) లో అత్యంత తెలివైన జట్టు ఏదన్న ప్రశ్నకు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ గతంలో దక్షిణాఫ్రికా (South Africa) అని సమాధానమిచ్చాడు. డే లైట్ లోనూ, డే అండ్ నైట్ మ్యాచ్ లోనూ దక్షిణాఫ్రికా వ్యూహాలు అమోఘం అన్నాడు. చివరికి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా అంచనా వేసిన దక్షిణాఫ్రికా ప్రస్ధానం అనూహ్యంగా సెమీస్ తోనే ముగిసిపోయింది. అయితే ఇప్పుడు ఈ టోర్నీలో అత్యంత తెలివి తక్కువ జట్టు ఏదన్న ప్రశ్నకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ (Michael Vaughan)సమాధానం ఇచ్చాడు.
విచిత్రంగా టీ20 వరల్డ్ కప్ లో అత్యంత తెలివి తక్కువ జట్టు ఏదన్న ప్రశ్నకు కూడా దక్షిణాఫ్రికానే అని మైకేల్ వాన్ తేల్చేశాడు. దీని వెనుక ఉన్న ఓ కీలక కారణాన్ని వాన్ విశ్లేషించాడు. సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో గెలవకపోయినా దక్షిణాఫ్రికా సెమీస్ కు చేరింది. కానీ భారత్ సూపర్ 8 నుంచి సెమీస్ కు చేరకుండా అడ్డుకునేందుకు దక్షిణాఫ్రికాకు విండీస్ మ్యాచ్ రూపంలో అద్భుతమైన అవకాశం లభించింది. దాన్ని దక్షిణాఫ్రికా చేతులారా జారవిడిచింది. ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా దక్షిణాఫ్రికా.. భారత్ ను సెమీస్ కు పంపిందని వాన్ అభిప్రాయపడ్డాడు.

ఈ టోర్నమెంట్‌లో అత్యంత తెలివితక్కువ జట్టు ఎవరు అని అనుకుంటున్నారన్న ప్రశ్నకు తాజా పాడ్ కాస్ట్ లో మైకేల్ వాన్.. దక్షిణాఫ్రికా అని చెప్పేశాడు. ఎందుకంటే దక్షిణాఫ్రికా సూపర్ 8లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోతే భారతదేశం నాకౌట్ అయ్యేదన్నాడు. ఆ సమయంలో భారత్ ను దక్షిణాఫ్రికా అలా పరోక్షంగా టోర్నీ నుంచి బయటకు పంపి ఉంటే చివరికి భారత్ సెమీస్, ఫైనళ్లకు చేరి టోర్నీ గెలిచి ఉండేది కాదని వాన్ విశ్లేషించాడు. కానీ విండీస్ పై గెలవడం ద్వారా భారత్ టోర్నీలో కొనసాగేందుకు దక్షిణాఫ్రికా అవకాశం ఇచ్చిందన్నాడు. చివరికి భారత్ టైటిల్ గెల్చుకుందన్నాడు.












Click it and Unblock the Notifications