పాకిస్థాన్ పంట పండింది.. ఫస్ట్ ఆఫీస్ ను ఓపెన్ చేసిన గూగుల్.. 9,60,000 మందికి ఉద్యోగాలు..!
పాకిస్థాన్ లో ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు, గ్యాస్ రవాణా నిలిచిపోయింది. దాంతో పాకిస్థాన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అలాగే ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. అంతేకాక అంతర్గత భద్రతా సవాళ్లతో ఆ దేశం అట్టుడుకిపోతుంది. ఇలాంటి పరిణామాల మధ్య పాకిస్థాన్ కు భారీ గుడ్ న్యూస్ అందింది. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన తొలి కార్యాలయాన్ని పాకిస్థాన్ లో ప్రారంభించింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఆగస్టు 18న అధికారికంగా ఈ ఆఫీస్ ను ప్రారంభించింది. దాంతో 30 బిలియన్ డాలర్ల ఐటీ ఎక్స్ పోర్ట్ హబ్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకున్న పాకిస్థాన్ కు తోడ్పాటును అందించింది. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ లో గూగుల్ పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కార్యాలయంతో గూగుల్- పాకిస్థాన్ ప్రభుత్వం మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి.
Prime Minister Muhammad Shehbaz Sharif shakes hands with Vice President Government Affairs and Public Policy of Google Mr. Wilson White at the inauguration of the office of Google Pakistan. Islamabad, 18 August 2026. pic.twitter.com/UPQzZLlrR8
— Prime Minister's Office (@PakPMO) August 18, 2026
గూగుల్ సంస్థ పాకిస్థాన్ లో లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సమకూర్చనుంది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఇస్లామాబాద్ లో నెలకొల్పిన గూగుల్ ఆఫీస్ ను తాజాగా ప్రారంభించారు. దేశంలోని డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ లో ఇది ఒక మైల్ స్టోన్ గా నిలుస్తుందని అన్నారు. పాకిస్థాన్ లో గూగుల్ భారీగా పెట్టుబడులు పెట్టడంతో ఆ దేశ టెక్నాలజీ సెక్టర్ మరింత విస్తరించనుంది. ఐటీ ఎగుమతులు రెట్టింపు కానున్నాయి. దేశంలోని యువకులు డిజిటల్ నైపుణ్యాలను అలవరచుకోనున్నారు.

స్థానిక టాలెంట్ ను ప్రపంచస్థాయి మార్కెట్స్ తో అనుసంధానం చేయనున్నారు. ఈ సమావేశంలో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ విల్సన్ ఎల్. వైట్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ లో గూగుల్ సంస్థ పెట్టుబడులు కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని అన్నారు. గత పదేళ్లుగా గూగుల్ నుంచి రూ. 3.9 ట్రిలియన్ విలువైన సేవలను దేశ ప్రజలు వినియోగించుకున్నారని అన్నారు. గత పదేళ్లలో దాదాపు 9,60,000 మందికి ఉపాధి, ఉద్యోగాలు అవకాశాలను గూగుల్ కల్పించిందని తెలిపారు. పాకిస్థాన్ ఐటీ ఎగుమతులను మరింతగా పెంచడంలో గూగుల్ సంస్థ కట్టుబడి ఉందని అన్నారు. పాకిస్థాన్ లోని విద్యార్థులకు ఒక సంవత్సరం పాటు ఫ్రీ గూగుల్ జెమినీ సబ్ స్క్రిప్షన్ ను ఈ మేరకు అందిస్తామని విల్సన్ ఎల్. వైట్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications