తిరుపతి ఎయిర్‌పోర్ట్ పై కేంద్రం అనూహ్య నిర్ణయం, ఇక నుంచి...!!
తిరుపతి విమానాశ్రయం పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తిరుపతి ఏయిర్ పోర్టు ప్రైవేట్‌పరం కానుంది. వారణాసి సహా దేశంలోని మరో 10 ఎయిర్‌పోర్టులనూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల చేతికి అప్పగించాలని నిర్ణయించింది. ప్రభుత్వ-ప్రైవేట్-భాగస్వామ్యం (పీపీపీ) విధానం కింద 5 గ్రూపులుగా విభజించి మొత్తం 11 విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని డిసైడ్ అయింది. కాగా.. తిరుపతి విమానాశ్రయం విస్తరణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తిరుపతి, తిరుచిరాపల్లి విమానాశ్రయాలను కేంద్రం ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. వీటి నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని ఏఏఐ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటనను జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల రద్దీ, ప్రత్యేక సదుపాయాల ఏర్పాటు దృష్ట్యా బండ్లింగ్ చేయాలని డిసైడ్ అయింది. రాష్ట్రంలో మరో రెండు విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేసే పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఏయిర్ పోర్టును తమిళనాడులోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంతో బండ్లింగ్ చేసి ప్రైవేటీకరించనున్నారు. విమానాశ్రయం ఆధునీకరణతో పాటుగా మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడం, ఆదాయాన్ని పెంచుకోవటం లక్ష్యంగా కనిపిస్తోంది. తొలి సారిగా రెండు విమానాశ్రయాలను బండ్లింగ్ చేసి ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించింది.

కేంద్రం తాజా నిర్ణయం తో
కాగా, 2020లో అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, గువాహటీ, తిరువనంతపురం విమానాశ్రయా ల నిర్వహణను ప్రైవేటుకు ఏఏఐ అప్పగించింది. ఇప్పుడు మొదటి సారి బండ్లింగ్ విధానంలో ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించింది. తిరుమలకు వచ్చే భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో విమానాశ్రయంలో రద్దీ పెరుగుతోంది. ప్రస్తుతం తిరుపతి నుంచి హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాలతో పాటు రాష్ట్రంలోని విజయవాడ, విశాఖకి రోజూ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ, భూమి లభ్యత, వాణిజ్య సామర్థ్యం, ఆర్థిక పనితీరు, ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని డేటా ఆధారిత విశ్లేషణ ద్వారా కేంద్రం విమానాశ్రయాలను బండ్లింగ్ చేయాలని నిర్ణయించింది. తిరుపతి విమానాశ్రయాన్ని తిరుచిరాపల్లితో కలపడం ద్వారా కొత్త పెట్టుబడుల ఆకర్షణ, నిర్వహణ సామర్థ్యం, వాణిజ్యపరంగా అభివృద్ధి వేగవంతం అవుతుందని అంచనా వేస్తున్నారు. రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాలనూ బండ్లింగ్ విధానంలో అప్పగించే అవకాశం ఉందని సమాచారం.













Click it and Unblock the Notifications
