సీఈసీకి మరో షాక్..! మహారాష్ట్ర సీఈవో సంచలన లేఖ-కమిషనర్ల ఆరోపణలకు బలం..!
కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీకు తెలియకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం బయటపెట్టిన తర్వాత ఈసీ ఈ ఆరోపణల్ని ఖండించింది. తామంతా ఏకగ్రీవంగానే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలకు బలం చేకూర్చేలా మహారాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) కమిషన్ కు ఓ లేఖ రాశారు. ఈ లేఖను ఇండియన్ ఎక్స్ ప్రెస్ బయటపెట్టడంతో మరోసారి కలకలం మొదలైంది.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ తనపై వచ్చిన ఆరోపణలపై తాజాగా ఇద్దరు కమిషనర్లతో సమావేశమై ఓ వివరణ ప్రకటన విడుదల చేశారు. అనంతరం అభ్యంతరాలు ఉన్న అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే గతంలో ఇదే ఇద్దరు ఎన్నికల కమిషనర్లు గుర్తించిన ఓ అంశంపై మహారాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (Maharashtra CEO) చోకలింగం కమిషన్ కు రాసిన లేఖ బయటికి వచ్చింది. ఇందులో చోకలింగం.. ఎస్ఐఆర్ లో స్థానిక సిబ్బందికి మరిన్ని అధికారాలు కల్పించాలని కోరారు. ప్రస్తుతం ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ నోటీసు దశలో ఉన్న అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అయిన చోకలింగం.. ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్‌లో 4 మార్పులు కోరుతూ గత వారం ఎన్నికల కమిషన్‌కు ఈ లేఖ రాశారు.

ఏ తార్కిక వ్యత్యాసాల కేసులకు విచారణ అవసరమో, ఏ పత్రాలను అంగీకరించాలో, ఏ వ్యత్యాసాలను వారే స్వయంగా పరిష్కరించుకోగలరో నిర్ణయించేందుకు ఈఆర్వోలకు అనుమతి ఇవ్వాలని మహారాష్ట్ర సీఈఓ చోకలింగం చేసిన అభ్యర్థనలు, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఇప్పటికే వ్యక్తం చేసిన ఆందోళనలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ సాఫ్ట్‌వేర్ ఈఆర్వోల అధికారాలను తగ్గిస్తోందని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అధికారికంగా గుర్తించినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దర్యాప్తులో వెల్లడైన ఒక రోజు తర్వాత.. సెప్టెంబర్ 24న సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీష్ గార్గ్, ఐటీ డైరెక్టర్ జనరల్ సీమా ఖన్నా , ఇద్దరు సచివాలయ అధికారుల్ని ఉద్దేంచి మహారాష్ట్ర సీఈఓ ఈ లేఖ రాశారు. ఇప్పటికే ఆగస్టు 31న ప్రచురించిన మహారాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితాలో రాష్ట్ర ఓటర్ల సంఖ్యను 21.1 శాతం తగ్గించారు. తుది జాబితా నవంబర్ 16న వెలువడనుంది. ఈ నేపథ్యంలో బయటికి వచ్చిన ఈ లేఖ ఈఆర్వోలకు అధికారాలు ఇవ్వకుండా ఈసీ చేస్తున్న అరాచకాన్ని బయటపెట్టేలా ఉందని విపక్షాలు విమర్శలకు దిగాయి.

Congratulations to the Election Commission's centralized software for emerging as the BJP's most effective 'Star Campaigner'! 🗳️💻
— Randeep Singh Surjewala (@rssurjewala) September 29, 2026
The absolute destruction of institutional credibility under CEC Gyanesh Kumar is now fully exposed on record. While the Calcutta High Court openly… pic.twitter.com/bOnuDBimqJ
బీజేపీకి అత్యంత ప్రభావవంతమైన 'స్టార్ క్యాంపెయినర్'గా అవతరించిన ఎన్నికల సంఘం కేంద్రీకృత సాఫ్ట్‌వేర్‌కు అభినందనలంటూ కాంగ్రెస్ నేత రణ్ దీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఆధ్వర్యంలో సంస్థాగత విశ్వసనీయత పూర్తిగా దెబ్బతినడం ఇప్పుడు రికార్డుల్లో పూర్తిగా బట్టబయలైందని, ఎన్నికల సంఘం కుమ్మక్కుతో ఉందా, ఒక ప్రైవేట్ పార్టీ మార్గదర్శకత్వంలో పనిచేస్తోందా అని కలకత్తా హైకోర్టు బహిరంగంగా ప్రశ్నిస్తుండగా, సీఈసీని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ దాఖలైన కొత్త పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందని గుర్తుచేశారు. ఇప్పుడు, మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అత్యంత ఆందోళన కలిగించే విషయాలను ధృవీకరించారన్నారు. ఢిల్లీ నుండి ఒక కేంద్రీకృత ఐటీ వ్యవస్థ (ECINet) ద్వారా ఎన్నికల యంత్రాంగాన్ని క్రమపద్ధతిలో హైజాక్ చేస్తున్నారన్నారు. ఓటర్లను ఈ విధంగా తొలగిస్తున్నారంటూ ఆయన పలు ఉదాహరణలను షేర్ చేశారు. భారత ప్రజాస్వామ్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలోపు, మోసపూరితమైన SIR ప్రక్రియను రద్దు చేసి, సీఈసీని అరెస్టు చేసి జవాబుదారీగా చేయాలని కోరారు.













Click it and Unblock the Notifications
