CEC జ్ఞానేష్ పై వేటు ? న్యాయశాఖకు కమిషనర్ల లేఖలు..!

కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీ (CEC) జ్ఞానేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి గతంలో లేఖలు రాశారు. వాటిపై ఇప్పటివరకూ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ తాజాగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ పరిశోధనాత్మక కథనం తర్వాత మారిన పరిస్ధితుల్లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను తప్పించాలని, అరెస్టు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఆయనపై వేటుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తో పెరుగుతున్న విభేదాలు, ఆయన పనితీరు, కమిషన్ పేరుతో తీసుకుంటున్న ఏకపక్ష, చట్టవిరుద్ధమైన నిర్ణయాలకు సంబంధించి ఇద్దరు ఎన్నికల కమిషనర్లు రాసిన లేఖలను క్యాబినెట్ కార్యదర్శి న్యాయ శాఖకు పంపినట్లు అత్యున్నత వర్గాలు వెల్లడించాయి. ఈ శాఖ భారత ఎన్నికల సంఘానికీ, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. దీంతో సీఈసీ వివాదాన్ని తేల్చేసేందుకు కేంద్రం సిద్దమవుతోందన్న చర్చ జరుగుతోంది.

CEC Under Scrutiny Sources Say Cabinet Secretary Forwarded Two ECs Letters to Law Ministry

ఇప్పటికే నీట్ అక్రమాల విషయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం తీవ్ర ఒత్తిళ్లు వచ్చినా చివరి నిమిషం వరకూ నాన్చడం ద్వారా ఢిల్లీలో విద్యార్ధుల ఆందోళనలకు, వాటికి దేశవ్యాప్త మద్దతు లభించేందుకు కారణమైన కేంద్రం.. ఇప్పుడు సీఈసీ విషయంలోనూ దాదాపు అలాంటి పరిస్ధితే ఎదుర్కొంటోంది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం తర్వాత దేశంలో విపక్షాలన్నీ సీఈసీకి వ్యతిరేకంగా ఏకమయ్యాయి. అలాగే స్వపక్షంలోని పార్టీలు కూడా సీఈసీ, ఎన్నికల సంఘం నుంచి జవాబుదారీతనం కోరుతున్నాయి.

CEC Under Scrutiny Sources Say Cabinet Secretary Forwarded Two ECs Letters to Law Ministry

ఈ నేపథ్యంలో సీఈసీని తప్పించడం, ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంలో మార్పులు చేస్తే తప్ప ఈ సెగ చల్లారేలా కనిపించడం లేదు. ఇందులో ముందుగా సీఈసీని తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే కర్నాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే రెండు రోజుల క్రితమే ట్వీట్ చేశారు. ఇందులో ఆయన సీఈసీని బలిపీఠం ఎక్కించేందుకు రంగం సిద్దమవుతోందని, కేవలం ఆయన్ను తప్పిస్తే సరిపోదని, ఆయన వెనుక ఉన్న వారెవరూ బయటపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+