ఎన్నికల జాతర, ఏ ఎన్నిక ఎప్పుడు - సెమీ ఫైనల్స్..!!

తెలంగాణలో రాజకీయాల్లో కీలక మలుపు. రాష్ట్రంలో ఎన్నికల జాతర మొదలు కానుంది. వరుసగా ఎన్నికల నిర్వహణ పైన కసరత్తు కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి కానుంది. ఈ సమయంలో వరుసగా జరిగే ఈ ఎన్నికల ద్వారా బల నిరూపణలకు మూడు ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నారు. దీని కోసం ఇటు కాంగ్రెస్.. బీఆర్ఎస్ శిబిరాల్లో వ్యూహాలు సిద్దం అవుతున్నాయి.

తెలంగాణలో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగా వరుసగా జరిగే ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. డిసెంబర్ నుంచి ఎన్నికల జాతర మొదలు కానుంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ, కొన్ని జిల్లాల్లోని మునిసిపల్‌ కార్పొరేషన్‌న్లకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు కూడా జరగనున్నాయి. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపితే ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియ నడుస్తోంది. నవంబరు 5వ తేదీతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, పలు మునిసిపల్‌ కార్పొరేషన్లు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు సంబంధిత శాఖలకు ఇప్పటికే వెళ్లింది.

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌ పై TTD కీలక ప్రకటన, భారీ డిమాండ్ తో..!!
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌ పై TTD కీలక ప్రకటన, భారీ డిమాండ్ తో..!!
telangana-elections-greater-hyderabad-polls-two-graduate-mlc-elections-ahead-here-the-deails

సార్వత్రిక ఎన్నికల ముందు సెమీ ఫైనల్స్

కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 10న జీహెచ్‌ఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. మరోవైపు ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లతో పాటు మరో ఒకటి, రెండు చోట్ల మునిసిపాలిటీల ఎన్నికలు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటికీ ఎన్నికలు నిర్వహించి పూర్తిస్థాయి పాలకవర్గాలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజి గిరి మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేలా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ మూడు కార్పొరేషన్లతో పాటే ఖమ్మం, వరంగల్‌, ఇతర మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆయా ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ఫిబ్రవరి లేదా మార్చిలో ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+