అన్నామలై బాటలో ఐఎఎస్ అధికారిణి: యూపీ రాజకీయాల్లో లేడీ సింగం

ఐఏఎస్ అధికారిగా రాజీనామా చేసిన దివ్య మిట్టల్ తన భవిష్యత్తు ప్రణాళికలపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించారు. ఉత్తరప్రదేశ్‌లో ఆమె రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇతర నేతల్లా ఏ రాజకీయ పార్టీలోనూ చేరదలచుకోలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలతో కలిసి పనిచేస్తూ, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఒక నూతన వేదికను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.

ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి.. దివ్య మిట్టల్. దాదాపు 13 సంవత్సరాల పాటు ఉత్తరప్రదేశ్ లో వివిధ హోదాల్లో కొనసాగారు. కిందటి నెల 30వ తేదీన ఆమె తన ఐఏఎస్ హోదాకు రాజీనామా చేశారు. ఆ తర్వాత సరిగ్గా నెల రోజులకు తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను పంచుకున్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టిందని ఆమె పేర్కొన్నారు.

Resigned IAS officer Divya Mittal announced her entry into politics Uttar Pradesh to build platform

ఉత్తరప్రదేశ్ తన వర్క్ స్టేషన్ మాత్రమే కాదని, ఇక్కడి ప్రజలు తనను సొంత కూతురిగా ఆదరించారని దివ్య మిట్టల్ భావోద్వేగంతో చెప్పారీ వీడియోలో. అందుకే తన నూతన ఇన్నింగ్ ను ఇక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అధికారం, పదవుల కోసం తాను రాజకీయాల్లోకి రావట్లేదని, ప్రభుత్వ అధికారుల వరకు చేరని సామాన్య ప్రజల నిస్సహాయ గొంతుకగా వినిపించడమే తన ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

పసిడి ధరల్లో మరో భారీ పతనం: ఇక ఆగకపోవచ్చు.. !!
పసిడి ధరల్లో మరో భారీ పతనం: ఇక ఆగకపోవచ్చు.. !!

ఐఏఎస్ అధికారిగా ఉన్న సమయంలో మిర్జాపూర్‌లో ఓ మహిళ తనను కలిసిన సంఘటనను దివ్య మిట్టల్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆమె.. ఇల్లు, పెన్షన్ వంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ఊరిలో అయిదో తరగతి వరకు ఉన్న పాఠశాలను హైస్కూల్ గా మార్చాలని కోరారని, దానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించగా మూడేళ్ల క్రితమే అనుమతి లభించినా, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు.

ఎల్లుండే ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ రాబోతోందోచ్..: డిఫరెంట్ ఫార్మట్ లో సెమీస్ జట్ల ఎంపిక
ఎల్లుండే ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ రాబోతోందోచ్..: డిఫరెంట్ ఫార్మట్ లో సెమీస్ జట్ల ఎంపిక

ఉత్తర ప్రదేశ్ లో వనరులకు ఏ కొరతా లేనప్పటికీ.. పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే గ్రామ స్థాయిలో ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయని దివ్య మిట్టల్ వ్యాఖ్యానించారు. పరిపాలనలో జవాబుదారీతనం కొరవడటంపై దివ్య మిట్టల్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని, గుంతల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు
ఏపీ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు

వీటిని ప్రమాదాలుగా కొట్టిపారేయలేమని, అధికారుల నిర్లక్ష్యానికి ఖచ్చితంగా జవాబుదారీ చేయాలని దివ్య మిట్టల్ డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ఉన్న ఇటువంటి ప్రాథమిక సమస్యలపై యువత, పౌరులు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలోని లోపాల వల్ల నేటి యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమాజంలో మార్పు కోసం ప్రజలే స్వయంగా ముందుకు రావాలని సూచించారు.

ఆమె తీసుకున్న ఈ నిర్ణయం.. అన్నామలై ఉదంతాన్ని గుర్తు తెచ్చినట్టయింది. కర్ణాటక క్యాడర్ కు చెంిన ఐపీఎస్ అధికారి అన్నామలై కూడా తన సర్వీస్ కు రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. మొదట్లో ఆయన బీజేపీలో చేరినప్పటికీ.. సైద్ధాంతిక విభేదాల వల్ల అందులో నుంచి బయటికి వచ్చారు. ఓ నూతన ప్లాట్ ఫామ్ ను స్థాపించారు. నిత్యం జనంలో ఉంటూ స్థానిక సమస్య పరిష్కారానికి పోరాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+