దేశంలో అత్యంత ధనవంతుడైన హీరోగా నిలిచిన అక్కినేని నాగార్జున

ప్రముఖ టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున 'హురున్ ఇండియా రిచ్ లిస్ట్' తాజా జాబితాలో అరుదైన ఘనత సాధించారు. భారతదేశంలోనే అత్యంత ధనవంతులైన నటుల జాబితాలో ఆయన ఏకంగా రెండో స్థానాన్ని దక్కించుకుని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారు.హురున్ రిచ్ లిస్ట్ అంచనాల ప్రకారం నాగార్జున నికర ఆస్తుల విలువ సుమారు రూ. 5,000 కోట్లుగా ఉంది. దీనితో టాలీవుడ్‌లో అత్యధిక సంపద కలిగిన అగ్ర హీరోగా నిలవడమే కాక, బాలీవుడ్ దిగ్గజాలను సైతం వెనక్కి నెట్టి దేశవ్యాప్తంగా రెండవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

రాజమౌళికి బాగా నచ్చిన అక్కినేని నాగార్జున సినిమాలు రెండు
రాజమౌళికి బాగా నచ్చిన అక్కినేని నాగార్జున సినిమాలు రెండు

ఆర్థిక బలం టాలీవుడ్ కు ఎక్కవ

ఈ జాబితాలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సుమారు రూ. 10,000 కోట్ల నుంచి రూ. 12,900 కోట్ల సంపదతో దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. నాగార్జున తర్వాతి స్థానాల్లో అమితాబ్ బచ్చన్ (రూ. 4,000 కోట్లు), సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి ప్రముఖులు ఉన్నారు. విశేషం ఏమిటంటే, ఈ టాప్-10 జాబితాలో నాగార్జునతో పాటు మెగాస్టార్ చిరంజీవి (రూ. 1,700 కోట్లతో 8వ స్థానం), వెంకటేష్ (రూ. 1,650 కోట్లతో 9వ స్థానం), రామ్ చరణ్ (10వ స్థానం) వంటి నలుగురు టాలీవుడ్ స్టార్ హీరోలు చోటు దక్కించుకోవడం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆర్థిక బలమెంటో జాతీయ స్థాయిలో చాటిచెప్పాయి.

నాగార్జున మేనకోడలికి కేంద్రం కీలక పదవి
నాగార్జున మేనకోడలికి కేంద్రం కీలక పదవి
Akkineni Nagarjuna The Tollywood Actor emerges as the wealthiest hero in the country

విజయవంతమైన పారిశ్రామికవేత్త

కేవలం సినిమాల ద్వారా వచ్చే రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా, నాగార్జున ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్తగా పలు రంగాలలో చేపట్టిన వ్యాపార విస్తరణే ఆయన సంపద ఇంత భారీగా పెరగడానికి ప్రధాన కారణం. దివంగత అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన చారిత్రక 'అన్నపూర్ణ స్టూడియోస్', ప్రొడక్షన్ హౌస్, ఫిల్మ్ స్కూల్ ఆయన ప్రధాన వ్యాపార వనరులుగా ఉన్నాయి.

వీటితో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రైమ్ ప్రాంతాలలో భారీగా కమర్షియల్, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, 'ఎన్-కన్వెన్షన్', మీడియా రంగాలు , అలాగే స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు, ఇతర వ్యాపార భాగస్వామ్యాల ద్వారా తన ఆర్థిక సామ్రాజ్యాన్ని విజయవంతంగా విస్తరించారు. నటుడిగా దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు నిలకడైన వ్యాపార విధానాలతో అగ్రగామిగా నిలవడం ద్వారా నాగార్జున ఈ స్థాయికి చేరుకుని టాలీవుడ్ సత్తాను మరోసారి నిరూపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+