అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు
దేశంలో నేడు బంగారం, వెండి ధరలు పెరుగుదల బాట పట్టాయి. లాభాల స్వీకరణతో పాటు అమెరికా డాలర్ బలోపేతం కావడంతో పసిడి, వెండి రేట్లల్లో తాజా కదలిక చోటు చేసుకుంది. అంతర్జాతీయ పరిణామాలు కూడా వీటి రేట్లపై ప్రభావం చూపాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 10 గ్రాములకు రూ. 1,63,630కి చేరుకుంది. కిందటి ట్రేడింగ్ సెషన్ తో పోల్చుకుంటే ఇందులో 900 రూపాయలకు పైగా పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో, యుఎస్ స్పాట్ గోల్డ్ ధర 0.3 శాతం పెరిగి ఔన్సుకు రూ. 5,208.08 వద్ద ట్రేడ్ అయింది. ఈ వారంలో విడుదల కానున్న కీలక అమెరికా ఆర్థిక డేటా బులియన్ మార్కెట్ పై ప్రభావం చూపుతోంది. ఈ డేటా కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక విధాన నిర్ణయాలపై ఈ డేటా ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా బులియన్ ధరలపై ప్రభావం చూపుతుంది. వెండి ధర కిలోకు 0.85 శాతం మేర తగ్గింది. 2,75,479 రూపాయలకు చేరింది.

ముంబైలో మాత్రం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,63,630కి పెరిగింది. 22 క్యారెట్ల బంగారం రూ. 1,49,990కి లభించింది. ఢిల్లీ, జైపూర్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,49,010 కాగా, 24 క్యారెట్లు, రూ. 1,62,540గా ఉంది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,48,910, 24 క్యారెట్లు రూ.1,62,440గా నమోదైంది. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,48,860కి లభించగా, 24 క్యారెట్లు రూ. 1,62,390గా నిలిచింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,495, 22 క్యారెట్లు - రూ. 15,120, 18 క్యారెట్లు - రూ. 12,950
ముంబై..
24 క్యారెట్లు - రూ. 16,331, 22 క్యారెట్లు- రూ. 14,970, 18 క్యారెట్లు - రూ. 12,248
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 16,331, 22 క్యారెట్లు- రూ. 14,970, 18 క్యారెట్లు - రూ. 12,248
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 16,331, 22 క్యారెట్లు- రూ. 14,970, 18 క్యారెట్లు - రూ. 12,248
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 16,331, 22 క్యారెట్లు- రూ. 14,970, 18 క్యారెట్లు - రూ. 12,248
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 16,331, 22 క్యారెట్లు- రూ. 14,970, 18 క్యారెట్లు - రూ. 12,248

Click it and Unblock the Notifications