Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !!

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఏడాది వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. "హరిహర వీరమల్లు" చిత్రంతో నిరాశపరిస్తే.. 'ఓజీ' చిత్రంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు మార్చిలో 'ఉస్తాద్ భగత్‌సింగ్'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ క్రమంలోనే పవన్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం పట్టాలెక్కబోతోందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. రామ్ తాళ్లూరి నిర్మాణంలో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉందని అంటున్నారు. పవన్ పొలిటికల్ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

vijay-devarakonda-special-appearance-in-pawan-kalyan-and-surendar-reddy-new-movie

కాగా సురేందర్ రెడ్డి కిక్, రేసుగుర్రం, ఊసరవెల్లి, ధృవ, సైరా నరసింహా రెడ్డి చిత్రాలు మంచి హిట్స్ గా నిలవగా.. ఆయన చివర చిత్రం "ఏజెంట్" భారీ డిజాస్టర్ గా నిలిచింది. అఖిల్ హీరోగా నటించిన ఈ మూవీలో మమ్ముట్టి ముఖ్యపాత్రలో మెప్పించారు. దీంతో ఈ సినిమాతో మళ్లీ హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని భావిస్తున్నారట. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో కీలక అప్డేట్ టాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

స్పెషల్ క్యామియోలో రౌడీ హీరో..

ఈ చిత్రంలో మరో స్టార్ హీరో స్పెషల్ క్యామియో ఉంటుందని అంటున్నారు. కథలో ఆ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందని.. అందుకే ఆ క్యారెక్టర్‌కు సరైన ఇమేజ్ ఉన్న హీరోను తీసుకోవాలని సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఈ క్యారెక్టర్ కోసం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండని తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే యూత్ లో ఈ ఇద్దరు హీరోలకు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో పవన్-విజయ్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్... పవన్ సినిమాలో క్యామియో చేసినా ఆయన కెరీర్‌కు బూస్టింగ్ వచ్చే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో పవన్ సరసన ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయిల్ ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. సోషల్‌ మీడియా వేదికగా హిందీ, తెలుగు, తమిళ పాటలకు చేసిన డ్యాన్స్‌ వీడియోలతో ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే ప్రభాస్ సరసన "ఫౌజీ"మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు పవన్‌ సరసన కన్ఫర్మ్ అయితే ఇమాన్వీ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి మూవీ యూనిట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తుందో అని.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+