ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి, మన సంప్రదాయం ప్రకారం పంచె ధరించాలి. దేవాలయాలను సందర్శించుకొని షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తీసుకోవాలి.
ఇందులో 6 రకాల రుచులు కలిసి ఉంటాయి. తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు తీసుకోవడంవల్ల కొత్త సంవత్సరంలో, మన జీవిత పయనంలో ఎదురయ్యే అనేకరకాల సవాళ్లను అధిగమించడం, ఎదుర్కునే అనుభవాలన్నీ కొన్ని తియ్యగా, కొన్ని చేదుగా, కొన్ని వగరుగా.. ఇలా ఉంటాయని, అన్నింటినీ సమపాళ్లలో స్వీకరించాలని పండితులు చెబుతారు. తర్వాత సాయంత్రం పండితులు చెప్పే పంచాంగ శ్రవణాన్ని వింటాం. ఆ ప్రకారం కొత్త సంవత్సరం ఏవిధంగా ఉండబోతోంది అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తాం. మనకు తెలుగులో 12 రాశులుంటాయి. వీటిని ద్వాదశ రాశులు అంటారు. ఉగాది అనగానే కొత్త సంవత్సరంలో తమకు చాలా బాగుంటుందనే ఆశతో ఎంతోమంది రాశులవారు ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం మీన రాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

వృషభ రాశి - పరాభవ నామ సంవత్సర (19.03.2026 - 06.04.2027)
ఆదాయం: 12
వ్యయం: 13
రాజపూజ్యం: 5
అవమానం: 4
పరాభవ నామ సంవత్సరం వృషభ రాశివారికి మిశ్రమ ఫలాలను ఇచ్చే సంవత్సరం. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఇల్లు, వాహనం, కుటుంబ అవసరాలు లేదా వైద్య కారణాల వల్ల తప్పనిసరి ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. ఉద్యోగ రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. బదిలీ లేదా ఉద్యోగ మార్పునకు అవకాశం ఉంది. అధికారులతో కలిసి మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు నెమ్మదిగా స్థిరమైన లాభాలు వస్తాయి. పాత స్నేహితులు లేదా కొత్తగా పరిచయం అయినవారితో ముఖ్యమైన పని ఒకటి విజయవంతం అవుతుంది.
ఆస్తి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. రికార్డుల పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జీర్ణక్రియ, కంఠం లేదా కఫ సంబంధిత సమస్యలు వస్తాయి. సరిపడినంత వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవాలి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. దాంపత్య జీవితంలో పరస్పరం అవగాహన చేసుకోవడం అవసరం. ధార్మిక యాత్ర, పుణ్య కార్యాలు లేదా దేవాలయ దర్శనం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. శాంతి, సహనంతో ఈ సంవత్సరం విజయవంతంగా ముందుకు సాగుతుంది. సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు.
మేష రాశి - పరాభవ నామ సంవత్సర (19.03.2026 - 06.04.2027)
ఆదాయం: 14
వ్యయ: 11
రాజపూజ్యం: 6
అవమానం: 3
పరాభవ నామ సంవత్సరం మేష రాశివారికి ధైర్యం, నమ్మకం కల్పిస్తుంది. ఈ సంవత్సరం ఆదాయం పెరుగుతుంది. పాత ప్రయత్నాలు ఫలించడం, కొత్త ప్రయత్నాలు లాభదాయకంగా ఉండటం జరుగుతుంది. ఉద్యోగ రంగంలో పదోన్నతి, బదిలీలతోపాటు అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. గౌరవం పెరుగుతుంది.
వ్యయాలు నియంత్రణలో ఉన్నా కుటుంబ అవసరాల కోసం, మతపరమైన పనులకు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆస్తి సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య పరంగా తలనొప్పి, శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సాత్విక ఆహారం తీసుకొని వ్యాయాయం చేస్తే చాలా మంచిది. దాంపత్య జీవితంలో సర్దుబాటు పెరుగుతుంది. అవివాహితులకు వివాహ యోగం కనిపిస్తుంది. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం ఉంటుంది.
మతపరమైన కార్యకలాపాలు, ఉపవాసం, మంగళవారం హనుమాన్ పూజ లేదా సుబ్రహ్మణ్య ఆరాధన శుభకరంగా ఉంటుంది. సాధారణంగా ఈ సంవత్సరం మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని అందిస్తుంది. పురోగతి, సమాజంలో గౌరవం కలుగుతాయి.
-
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
today rashiphalalu: భూమిని కానీ, వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు -
వాస్తు ప్రకారం ఇంటి గోడల్లో దోషం ఉంటుందా? -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ












Click it and Unblock the Notifications