వీడియోలు చూపించి పెళ్లి రద్దు?.. మృత్యువుతో పోరాడి తల్లి–కూతురు మృతి !!
బాపట్ల జిల్లాలో జరిగిన ఓ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. నిశ్చితార్థం జరిగి పెళ్లి పీటలు ఎక్కాల్సిన కుటుంబంలో అనూహ్యంగా విషాదం చోటుచేసుకుంది. కాబోయే వరుడు నమ్మక ద్రోహం చేయడమే కాకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి-కూతురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మార్టూరు మండలం పరిధిలోని ద్రోణాదుల గ్రామంలో చోటుచేసుకుంది.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దివ్య..
కాగా గ్రామానికి చెందిన సిరికొండ శ్రీనివాసరావు కుమార్తె దివ్య హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. మంచి చదువులు పూర్తి చేసి ఉద్యోగం సాధించిన ఆమెకు కుటుంబ సభ్యులు మార్టూరుకు చెందిన మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రావులకొల్లు శేషుబాబుతో వివాహం నిశ్చయించారు. గత ఏడాది డిసెంబర్ 14న ఇద్దరికీ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేసవిలో పెళ్లి జరగాల్సి ఉండగా అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి.

చర్చల పేరుతో పిలిపించి ఆరోపణలు..
ఈ నెల 4వ తేదీన పెళ్లి సంబంధం విషయమై మాట్లాడుకోవాలని చెప్పి శేషుబాబు.. దివ్యను పిలిపించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా దివ్యను రహస్యంగా అనుసరించి తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలను చూపిస్తూ ఆమె ప్రవర్తన సరిగా లేదంటూ నిందలు వేసినట్లు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో పెళ్లి చేసుకోనని స్పష్టంగా చెప్పడంతో దివ్య తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో తీవ్ర అవమాన భావనకు లోనైన దివ్య తన తల్లి సుజాతతో కలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే రోజు తల్లి-కూతురు ఇద్దరూ ఎలుకల మందు మరియు గడ్డి మందు సేవించినట్లు తెలుస్తోంది. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న వారిని గమనించిన తండ్రి శ్రీనివాసరావు వెంటనే వారిని గుంటూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అసుపత్రిలో వైద్యులు వారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి విషమంగా మారింది. వారం రోజులుగా చికిత్స పొందుతున్న దివ్య గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. ఆమె మరణం తర్వాత కొద్ది గంటలకే తల్లి సుజాత కూడా ప్రాణాలు కోల్పోయింది. ఒకే కుటుంబంలో తల్లి-కూతురు ఇద్దరూ మరణించడంతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.
ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు, ఫోటోలు-వీడియోల అంశం, పెళ్లి రద్దు వెనుక ఉన్న కారణాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అవసరమైతే సంబంధిత వ్యక్తులను విచారించి నిజానిజాలు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఇలా విషాదం చోటుచేసుకోవడం అందరినీ కలచివేసింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications