Anti Paper Leak Bill: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

పబ్లిక్ పరీక్షల్లో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీక్ లు, అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026' (యాంటీ పేపర్ లీక్ బిల్లు)కు రాజ్యసభ తాజాగా ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది. అయితే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.

జూలై 29 బుధవారం రోజున యాంటీ పేపర్ లీక్ బిల్లును లోక్ సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. బిల్లు ఆమోదం అనంతరం రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో తదుపరి ప్రక్రియలో భాగంగా బిల్లు రాష్ట్రపతి టేబుల్ మీదకు చేరనుంది. రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేస్తే అది చట్టంగా కార్యరూపం దాల్చనుంది.

ఇక పేపర్ లీక్‌ లకు పాల్పడేవారిపై కఠిన శిక్షలు విధించేలా ఈ బిల్లులో సవరణలు చేశారు. ప్రశ్నాపత్రాల లీక్ లు, మోసపూరిత చర్యలకు పాల్పడే దోషులకు కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడనుంది. అలాగే రూ.10 కోట్ల వరకు జరిమానా ఉండనుంది. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే అక్రమార్కులకు రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధించేలా నిబంధనలను చేర్చారు.

ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ.. అనుభవాల నుంచి నేర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఆ ఉద్దేశంతోనే పేపర్ లీక్ నిరోధక చట్టంలో మరింత కఠినమైన నిబంధనలను తీసుకొచ్చామని వివరించింది. ఇక ఈ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జూలై 27న లోక్‌ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

RajyaSabha passes anti-paper leak bill passed anti paper leak law terms with up to 10 years jail

మరోవైపు నీట్ పేపర్ లీక్ పై దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతాపార్టీ ఆధ్వర్యంలో భారీగా ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థుల ఉద్యమం తీవ్రస్థాయికి చేరడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషీ నియమితులయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+