క్రికెట్ ప్రపంచంలో విషాదం: చోటుదక్కలేదని క్రికెటర్ ఆత్మహత్య

క్రికెట్‌లో మంచి స్థాయికి ఎదగాలని కలలు కన్న ఓ యువ క్రీడాకారిణి ఆశలు అడియాసలయ్యాయి. క్రికెట్‌లో గొప్ప విజయం సాధించాలని కలలు కన్న నాగ్‌పూర్‌కు చెందిన 17 ఏళ్ల క్రికెటర్ అదితి మోరేశ్వర్ చౌకండే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ తనను ఎంపిక చేయకపోవడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో, "నన్ను ఎంపిక చేయలేదు..." అని ఆమె రాసింది. ఈ ఘటన క్రీడా ప్రపంచాన్ని, నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఉదయం సుమారు 5:30 గంటలకు, లక్ష్మీ నగర్‌లోని జైన దేవాలయం సమీపంలో ఉన్న ఉమలక్ష్మి అపార్ట్‌మెంట్స్‌లోని నాలుగో అంతస్తులో నివసించే అదితి మోరేశ్వర్ చౌకండే (17) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

షైనింగ్ స్టార్ అవార్డ్ తీసుకుంటా.. సీఎంను మెప్పించిన శివాని సూసైడ్.. షాక్ లో చంద్రబాబు!
షైనింగ్ స్టార్ అవార్డ్ తీసుకుంటా.. సీఎంను మెప్పించిన శివాని సూసైడ్.. షాక్ లో చంద్రబాబు!

మహారాష్ట్రలోని అకోలాకు చెందిన అదితి.. గత రెండేళ్లుగా తన తల్లితో కలిసి నాగ్‌పూర్‌లో నివసిస్తూ , సర్వే క్రికెట్ అకాడమీలో కఠోరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె సోదరుడు కూడా క్రికెటర్ కావడంతో అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడాలన్నది ఆమె కల. ఇటీవల విదర్భ క్రికెట్ అసోసియేషన్ ఎంపిక ప్రక్రియలో పాల్గొనలేకపోవడంతో ఆమె కుంగుబాటుకు, మానసిక ఒత్తిడికి లోనైందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక ఆత్మహత్య లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు, అందులో తాను ఎంపిక కాలేదని ఆమె రాసింది.

17-Year-Old Female Cricketer Dies by Suicide in Nagpur Over VCA Selection Snub Full Details
క్రికెట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్- అన్ని ఫార్మాట్లకు టీం ఇండియా క్లాస్ ప్లేయర్ గుడ్ బై..!!
క్రికెట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్- అన్ని ఫార్మాట్లకు టీం ఇండియా క్లాస్ ప్లేయర్ గుడ్ బై..!!

ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న వెంటనే బజాజ్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ప్రస్తుతం పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఆత్మహత్యకు గల అసలు కారణాలు తెలుస్తాయని బజాజ్‌నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ చేతన్ చౌహాన్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+