కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్దులు ఖరారు..!?
తెలంగాణలో ఎన్నికల జాతర మొదలు కానుంది. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతోంది. దీంతో, ఈ వరుస ఎన్నికలు కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. ఈ ఎన్నికలు.. నిర్ణయాల పైన ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం కొనసాగుతోంది. సీఎం రేవంత్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పార్టీ - ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలను వెల్లడించారు. అందులో భాగంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్దుల విషయంలోనూ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. అభ్యర్దులను అధికారికంగా ప్రకటించనున్నారు.
తెలంగాణలో వరుస ఎన్నికల వేళ హైకమాండ్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నిక లే లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా ప్రతీ ఎన్నికను సీరియస్ గా తీసు కోవాలని నిర్దేశించింది. పంచాయితీ, గ్రేటర్, ఖైరతాబాద్ బై పోల్ తో పాటుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తును తెలంగాణ కాంగ్రెస్ పూర్తి చేసింది. రెండు స్థానాలకు జాబితాను సిద్ధం చేసిన టీపీసీసీ.. దాన్ని అధిష్ఠానానికి పంపించింది. సామాజిక సమీకరణాల వారిగా జాబితాను టీపీసీసీ సిద్దం చేసింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి తుది జాబితాలో ముగ్గురికి చోటు కల్పించింది. ఓసీ, బీసీ, ఎస్సీ సామాజికవర్గాల నుంచి ఒక్కో పేరును అధిష్ఠానానికి టీపీసీసీ పంపించింది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, సామ రామ్మోహన్ రెడ్డి, గౌరీ సతీష్ పేర్లతో కూడిన జాబితాను పంపగా.. ఈ ముగ్గురిలో ఒకరి పేరును ఏఐసీసీ ఫైనల్ చేయనుంది.

పార్టీ ముఖ్య నేతలతో రేవంత్ కీలక సమావేశాలు
అదే విధంగా నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ముగ్గురు పేర్లతో జాబితాను టీపీసీసీ సిద్ధం చేసింది. ఈ స్థానానికి ఇద్దరు ఓసీ, ఒక బీసీ పేర్లతో జాబితాను రెడీ చేసి అధిష్ఠానానికి పంపించింది. ప్రస్తుత ఆర్టీఐ కమిషనర్ పీవీ శ్రీనివాస్, సూర్యాపేటకు చెందిన సర్వోత్తమ్ రెడ్డి, ఓయూకు చెందిన పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గౌడ్ పేర్లతో జాబితా రూపొందించింది. ఈ ముగ్గురిలో ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం లభించనుంది. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ సహకరించాలని నేతలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేయనున్నారు. ఇక.. అభ్యర్దులను ముందుగానే ఫిక్స్ చేయటం ద్వారా ఓటర్లలోకి వెళ్లటం.. ప్రచారం కోసం సమయం ఉంటుందని భావిస్తున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన తరువాత వీరి పేర్ల విషయం లో అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
