ప్రమాదంలో మరణించిన ప్రియుడు కలలో పిలుస్తున్నాడని యువతి ఆత్మహత్య!

వారిద్దరూ ప్రేమించుకున్నారు.కలిసి బ్రతకాలనుకున్నారు. పెళ్ళికి అన్నీ సిద్ధం చేసుకునే సమయంలో ఊహించని ప్రమాదం ఆ యువకుడి ప్రాణాలు తీసింది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన ప్రియురాలు ఆ బాధను తట్టుకోలేక తనువూ చాలించింది. తన ప్రియుడు తనను రమ్మని పిలుస్తున్నాడని చెప్పి ప్రాణం తీసుకుంది.

హైదరాబాద్ శంషాబాద్‌లోని సిద్ధార్థ కాలనీలో నర్మద అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. 19 ఏళ్ల బూర నర్మద నిజామాబాద్‌కు చెందిన సిద్ధార్థ్ బేజనీ గౌడ్‌తో ప్రేమలో ఉండేది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని కలలు కనేవారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే అనూహ్యంగా సిద్ధార్థ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు.ప్రియుడి మరణం నర్మదను పూర్తిగా కుంగదీసింది.

Young Woman suicide for lover in Shamshabad After Boyfriend s Death she spoke of him calling in dreams

ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ప్రియుడు లేని లోకంలో తాను ఉండలేనని చెబుతూ నిత్యం ఏడుస్తూ ఉండేది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత నచ్చజెప్పినా ఆమెకు ప్రియుడి లేని లోటు మాత్రమే కనిపిస్తూ ఉండేది. ఇటీవల ఆమె ప్రియుడు కలలోకి వచ్చి తన దగ్గరకు రమ్మంటున్నాడని, ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు, సోదరికి చెప్పింది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ప్రియుడి దగ్గరకే తానూ వెళ్తున్నానని నర్మద ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రియుడి మరణం తట్టుకోలేకనే కూతురు ఈ దారుణాన్ని చేసుకుందని తండ్రి పోలీసులకు తెలిపాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

దసరా పండుగ వేళ అటవీ శాఖ కీలక హెచ్చరిక!
దసరా పండుగ వేళ అటవీ శాఖ కీలక హెచ్చరిక!

ఈ ఘటన చుట్టుపక్కల వారిని సైతం కలచివేసింది. ప్రేమించుకున్న ఇద్దరు కలిసి జీవించాలనుకున్నారు. కానీ అనూహ్య మరణం ఒకరిని తీసుకెళ్లగా, మరొకరు ఆ లోటును భరించలేక ఆత్మహత్య చేసుకోవటం అందరినీ బాధకు గురి చేసింది. ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదని మానసిక నిపుణులు చెప్తున్నారు. మీరు ఒత్తిడికి, నిరాశకు లోనవుతున్నట్లు అనిపిస్తే వెంటనే సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+