వైఎస్ జగన్ ఇంట తీవ్ర విషాదం

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. జగన్ పెదనాన్న, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడైన వైఎస్ ఆనంద్ రెడ్డి ఇవాళ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆనంద్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

AP Weather: ఏపీకి వాయుగండం- రేపు ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..!
AP Weather: ఏపీకి వాయుగండం- రేపు ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి సోదరుడైన వైఎస్ కొండారెడ్డి కుమారుడే ఈ వైఎస్ ఆనంద్ రెడ్డి. ఆ రకంగా ఆనంద్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరుసకు అన్నదమ్ములు అవుతారు. ఇక వైఎస్ ఆనంద్ రెడ్డి సతీమణి సుశీలమ్మ గతేడాది కన్నుమూశారు. వైఎస్ ఆనంద్ రెడ్డికి సునీత అనే కూతురు ఉన్నారు. వైఎస్ ఆనంద్ రెడ్డి మృతితో వైఎస్సార్ జిల్లాతో పాటు ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆనంద్ రెడ్డి మరణ వార్త తెలుసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక శుక్రవారం పులివెందులలో జరిగే అంత్యక్రియలకు వైఎస్ జగన్ హాజరు కానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

YS Jagan Uncle YS Anand Reddy Passes Away Deep Sadness in YSR Family Full Details here
ఏపీలో ఉద్యోగుల జీతాలపై గుడ్ న్యూస్- ఆర్ధిక శాఖ కీలక ఆదేశాలు..!
ఏపీలో ఉద్యోగుల జీతాలపై గుడ్ న్యూస్- ఆర్ధిక శాఖ కీలక ఆదేశాలు..!

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మొదట్లోనే వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అభిషేక్ రెడ్డి ఈ ఏడాది జనవరి తొలి వారంలో ప్రాణాలు కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+