ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ 'వడా పావ్' ను బ్యాన్ చేసిన మహారాష్ట్ర సర్కార్.. కారణం ఏంటి..?
మహారాష్ట్ర అనగానే చాలామందికి ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ 'వడా పావ్' గుర్తుకువస్తుంది. వడాపావ్ ను పేద, ధనిక, చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. ముంబైకు కొత్తగా వచ్చిన వారు ఎవరైనా సరే ఒక్కసారైనా వడాపావ్ ను టేస్ట్ చేయాల్సిందే. హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్ అయిందో ముంబైలో వడాపావ్ అంత ఫేమస్ అయింది. అయితే వడాపావ్ ను తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది.
మహారాష్ట్ర లోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల ఆవరణలో దాదాపు 50 మీటర్ల వరకూ జంక్ ఫుడ్ ను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల ప్రకారం.. వడాపావ్ లాంటి జంక్ ఫుడ్ ను పాఠశాల ఆవరణలో విక్రయించడం, కొనుగోలు చేయడం పూర్తిగా బ్యాన్ అని సర్క్యూలర్ జారీ చేసింది.
నిషేధించిన ఆహార పదార్థాల్లో వడాపావ్ తో పాటు కూల్ డ్రింక్స్, సమోసాలు, చాక్ లేట్లు, ఐస్ క్రీమ్ లు, డీప్ ఫ్రైతో పాటు చక్కెర శాతం అధికంగా ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ అలాగే ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ అధకంగా ఉన్న ఆహార పదార్థాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ కమిషనర్ తుకారాం ముండే మాట్లాడుతూ.. అధిక కొవ్వు, అధిక ట్రాన్స్ ఫ్యాట్, అధిక చక్కెర వస్తువులు, డీప్ ఫ్రై పదార్థాలు, చక్కెర స్థాయి ఉన్న కూల్ డ్రింక్స్, వడాపావ్, సమోసా, కూల్ డ్రింక్స్, చాక్ లేట్లు, ఐస్ క్రీమ్ లను స్కూల్ ఆవరణలో విక్రయించడం, కొనుగోలు చేయడం, ప్రచారాలు చేయడం పూర్తిగా నిషేధం అని తెలిపారు.

ఈ అంశంపై స్కూల్ ప్రిన్సిపల్ ఇతర మేనేజ్ మెంట్ పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని.. అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని తుకారాం ముండే స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం, స్కూల్ యాజమాన్యం సంయుక్తంగా టీమ్ గా ఏర్పాటై జిల్లా, మండల స్థాయిలో వర్క్ షాప్స్ నిర్వహించి అవగాహన కల్పించాలని సూచనలు చేశారు.













Click it and Unblock the Notifications