వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్ ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుంది తెలుసా?

ఇల్లు కట్టుకొనేటప్పుడు తప్పనిసరిగా వాస్తు పద్దతులు పాటించాలి. ఇంటి ప్రధాన ద్వారం ఏ దిక్కులో ఉంటే ఎలాంటి ఫలితం మనకు లభిస్తుంది? మనకున్న స్థలాన్ని బట్టి ఎక్కడ కట్టాలి? దీంట్లో ఏవైనా తప్పులుంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయా? అటువంటప్పుడు వాస్తు నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం ఏం చేయాలి? ఇంటికి గుండె వంటి సింహద్వారం విషయంలో ఏ జాగ్రత్తలు పాటించాలి? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

ఇంటి ముఖద్వారం వాయువ్యం మూల ఉత్తరం దిక్కుకు అసలు ఉండకూడదు.
పడమర దిక్కుకు ఉంటే ఎటువంటి దోషం ఉండదు.
అయితే ఇదొక్కటే కాకుండా ఇతర అంశాలను కూడా పరిశీలించాలి.
ప్రధాన ద్వారం చాలా ప్రదేశాల్లో పెట్టుకోవచ్చు.
ఇంట్లో ముఖద్వారం పెట్టుకోవడానికి మొదట ప్రాధాన్యం ఈశాన్యం మూల తూర్పు దిక్కు.
అది అన్నిరకాలుగా మనకు కలిసి వచ్చేలా చేస్తుంది.
రెండో ప్రాధాన్యం ఉత్తర దిక్కు.
ఈ రెండింటి తర్వాత వాయువ్యం మూల పడమర దిక్కు.
ఇవన్నీ కుదరనప్పుడు మధ్య తూర్పు, మధ్య దక్షిణం, మధ్య పడమర,
మధ్య ఉత్తరం, ఆగ్నేయం మూల తూర్పు, దక్షిణం దిక్కులకు పెట్టుకోవచ్చు.
స్థలాన్ని బట్టి, వీలును బట్టి ఏర్పాటు చేసుకోవాలి.

vastu tips Did you know that according to priniciples the main door of the house can cause financial problems

తలుపు తీసేటప్పుడు, వేసేటప్పుడు కిర్రుమని శబ్దం రాకూడదు.
ఇలా శబ్దం వస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదు.
ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది.
ద్వారం ఎప్పుడూ శుభ్రంగా, అందంగా ఉండాలి.
తలుపులకు రంగు వెలిసిపోయినా, చెక్క విరిగిపోయినా
ప్రతికూల శక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది.

ప్రధాన ద్వారానికి ఎదురుగా చెత్త కుండీలు, పాత సామాన్లు ఉండకూడదు.
విద్యుత్ స్తంభాల వంటి అడ్డంకులు ఉండకూడదు.
ఇలా ఉంటే ఇవి ఇంట్లోకి వచ్చే ధన ప్రవాహాన్ని అడ్డుకుంటాయి.

ఇంటి ప్రధాన ద్వారానికి కచ్చితంగా గడప ఉండాలి.
గడప లేని ఇల్లు ఆర్థికంగా నిలకడగా ఉండదు.
గడప ఇంటి లోపలి లక్ష్మిని బయటకు పోకుండా కాపాడుతుందని నమ్మకం.

ఇంట్లోని ఇతర తలుపుల కంటే ప్రధాన ద్వారం పెద్దదిగా, ఎత్తుగా ఉండాలి.
ఇది ఇంటి యజమాని గౌరవ మర్యాదలను, ఆర్థిక స్థితిని ప్రతిబింబిస్తుంది.
ప్రధాన ద్వారం చిన్నదిగా ఉంటే అవకాశాలు చేజారిపోతాయి.
వాస్తు ప్రకారం దీన్ని మార్చడం కుదరని పక్షంలో ద్వారంపైన ఓం, స్వస్తిక్ లేదా లక్ష్మీదేవి ఫోటోలను ఉంచాలి.
నిత్యం మామిడి తోరణాలు లేదా పూల తోరణాలు కట్టండి.
ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ వెలుతురు ఉండేలా చూసుకోవాలి.
సాయంత్రం వేళ అక్కడ దీపం వెలిగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+