ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం

తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి, మన సంప్రదాయం ప్రకారం పంచె ధరించాలి. దేవాలయాలను సందర్శించుకొని షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తీసుకోవాలి.

ఇందులో 6 రకాల రుచులు కలిసి ఉంటాయి. తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు తీసుకోవడంవల్ల కొత్త సంవత్సరంలో, మన జీవిత పయనంలో ఎదురయ్యే అనేకరకాల సవాళ్లను అధిగమించడం, ఎదుర్కునే అనుభవాలన్నీ కొన్ని తియ్యగా, కొన్ని చేదుగా, కొన్ని వగరుగా.. ఇలా ఉంటాయని, అన్నింటినీ సమపాళ్లలో స్వీకరించాలని పండితులు చెబుతారు. తర్వాత సాయంత్రం పండితులు చెప్పే పంచాంగ శ్రవణాన్ని వింటాం. ఆ ప్రకారం కొత్త సంవత్సరం ఏవిధంగా ఉండబోతోంది అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తాం. మనకు తెలుగులో 12 రాశులుంటాయి. వీటిని ద్వాదశ రాశులు అంటారు. ఉగాది అనగానే కొత్త సంవత్సరంలో తమకు చాలా బాగుంటుందనే ఆశతో ఎంతోమంది రాశులవారు ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం మీన రాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

Ugadi Horoscope check out the Results for these two signs gemini and cancer

కర్కాటక రాశి - పరాభవ నామ సంవత్సర (19.03.2026 - 06.04.2027)

ఆదాయం: 11
వ్యయం: 12
రాజపూజ్యం: 4
అవమానం: 5

పరాభవ నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి హెచ్చరిక లాంటిది. చేసిన తప్పులను ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆదాయం తగినంతగా ఉన్నప్పటికీ ఖర్చు ఉండొచ్చు. కుటుంబ అవసరాలు, గృహ నిర్మాణ పనులు, వైద్య ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడి ఉంటుంది. డబ్బు వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రణాళిక రచించుకోవాలి.

ఉద్యోగ రంగంలో బాధ్యతలు కొత్తవి చేపడతారు. ఉన్నతాధికారుల లక్ష్య సాధన కోసం ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపారస్థులు కొత్త పెట్టుబడులతో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి సంబంధిత వ్యవహారాలలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మంచిది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తాయి. దాంపత్య జీవితంలో సహనంగా ఉండాలి. ఇద్దరి మధ్య మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల సహాయంతో ఒక ప్రముఖ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా జీర్ణక్రియ, ఛాతీ లేదా మానసిక ఒత్తిడి సమస్యలు కనిపిస్తాయి. వీటి పరిష్కారానికి విశ్రాంతి, ధ్యానం సహాయపడతాయి.

ధార్మిక కార్యాలు, దేవాలయ దర్శనం లేదా జప-తపం ద్వారా మన శాంతి లభిస్తుంది. కష్టాలు క్రమంగా తగ్గుతాయి. సహనంతో, చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఈ సంవత్సరాన్ని మంచి సంవత్సరంగా మారుస్తాయి. సమస్యలు ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యంతో విజయాలు సాధిస్తారు.
============================

మిథున రాశి - పరాభవ నామ సంవత్సర (19.03.2026 - 06.04.2027)

ఆదాయం: 13
వ్యయం: 10
రాజపూజ్యం: 7
అవమానం: 2

పరాభవ నామ సంవత్సరం మిథున రాశివారికి అత్యంత అనుకూలంగా, విజయాలతో కూడి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. భాగస్వామ్యంతో చేసే వ్యాపారాలవల్ల లాభాలుంటాయి. మాటతీరు, చాతుర్యం, కమ్యూనికేషన్స్ వల్ల ప్రత్యేకంగా గౌరవం, ప్రతిష్ఠ సమాజంలో కలుగుతాయి. సమాజంలో గౌరవం ఎక్కువగా కలుగుతుంది.

ఉద్యోగ రంగంలో పురోగతి, పదోన్నతి ఉంది. వ్యాపారస్థులకు కొత్త వినియోగదారులు దొరుకుతారు. కొత్త ఆర్డర్లు వస్తాయి. విదేశీ ప్రయాణం లేదా విదేశాలకు సంబంధించిన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నవారికి ఈ ఏడాది అవకాశం లభిస్తుంది. పరీక్షలలో ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్యాభ్యాసానికి వెళతారు.
కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. దాంపత్యంలో సర్దుబాటు మంచిది. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అధిక పని నుండి ఉపశమనం కలగాలంటే కొంత విశ్రాంతి కూడా అవసరం.

శత్రువులు లేదా మీ ప్రత్యర్థులు మీ పురోగతిని చూసి ఈర్ష్యపడతారు. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఫలితాలనిస్తాయి. గురు పూజ, దాన ధర్మాలు శుభఫలాలనిస్తాయి. సాధారణంగా ఈ సంవత్సరం మిథున రాశి వారికి పనితీరు, గౌరవంతోపాటు ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+