ఏప్రిల్ లో మంగళాదిత్య రాజయోగం.. ఈ రాశులవారు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నారు!

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఇదే క్రమంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి సూర్యుడు, కుజుడు కలిసి మీనరాశిలో మంగళాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. సుమారు 18నెలల తర్వాత మీనరాశిలోకి ప్రవేశించే కుజుడు సూర్యుడితో కలిసి ఈ యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేష రాశి

మంగళాదిత్య రాజయోగం కారణంగా మేషరాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి చక్రానికి కుజుడు అధిపతి కావడంతో ఈ రాజయోగం మేషరాశి నుండి 12వ ఇంట్లో ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు మీ కెరీర్ లో కొత్త బాధ్యతలను అందుకుంటారు. పనిచేసే చోట మీ కృషి ప్రశంసించబడుతుంది. వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. మేష రాశి వారి పెండింగ్ పనులు పూర్తవుతాయి.

Mangaladitya RajaYoga in April People of these zodiac signs are going to strong in financial position

సింహరాశి

మంగళాదిత్య రాజయోగం కారణంగా సింహరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. సూర్యుడు ఈ రాశిని పాలించే గ్రహం కావడంతో ఈ రాశి వారికి శుభాలు చేకూరుతాయి. ఈ రాజయోగం సింహరాశి నుండి 8వ ఇంట్లో ఏర్పడడంతో, కొత్త ఉద్యోగాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. విదేశీ సంబంధ వ్యవహారాలలో విజయాలు సాధించే సంకేతాలు ఉన్నాయి. సింహరాశి వారి ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. సింహరాశి వారి పెట్టుబడులు లాభాలను ఇస్తాయి.

ధనుస్సు రాశి

మంగళాదిత్య రాజయోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు ప్రయోజనాలు చేకూరుతాయి. మీ రాశి నుండి నాలుగవ ఇంట్లో ఈ యోగం ఏర్పడడం వల్ల కొత్త ప్రణాళికలు విజయవంతం అవుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. నేడు వీరు వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులకు ఇది మంచి సమయం. ఆర్థిక విషయాలలో కూడా మెరుగుదల ఉంటుంది. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ మాసం నుండి వీరికి కలిసొస్తుంది.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+