వేల కోట్ల ఆస్తులు ఉన్న స్టార్ హీరో.. ఒకప్పుడు సమోసాలు అమ్మాడని తెలుసా..?

బాలీవుడ్ "బాద్‌షా".. షారూఖ్ ఖాన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఏమాత్రం సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి "కింగ్ ఖాన్" గా ఎదిగారు. 1992లో 'దీవానా' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 'బాజీగర్', 'డర్' వంటి సినిమాల్లో నెగటివ్ పాత్రలు పోషించి, నటుడిగా తనలోని వైవిధ్యాన్ని చాటుకున్నారు. 1995లో వచ్చిన 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' (DDLJ) షారుఖ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో ఆయన గ్లోబల్ స్టార్‌ గా మారిపోయారు. అలానే 'కుచ్ కుచ్ హోతా హై', 'దేవదాస్', 'వీర్-జారా' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు.

కాగా కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా.. 'స్వదేశ్', 'చక్ దే ఇండియా', 'మై నేమ్ ఈజ్ ఖాన్' వంటి చిత్రాల ద్వారా నటుడిగా తన సత్తా చాటారు. మధ్యలో పలు చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయినప్పటికీ.. 2023లో 'పఠాన్', 'జవాన్' సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి, తానెప్పుడూ 'కింగ్' అని నిరూపించుకున్నారు. ఇటీవల 'జవాన్' చిత్రానికి గాను ఆయన జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా అందుకున్నారు. కాగా ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్‌ సిద్ధార్థ్ ఆనంద్ తో చేతులు కలిపి "కింగ్‌" సినిమా చేస్తున్నారు షారుఖ్‌. అయితే నేడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటులలో ఒకరిగా ఆయన.. ఒకప్పుడు ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) క్యాంటీన్‌లో సమోసాలు సప్లై చేశాడని తెలుసా..?

actor-shahrukh-khan-became-talk-of-the-town-that-hes-selling-samosa-in-childhood-said-by-pankaj-kapo

అసలేం జరిగిందంటే..

సీనియర్ నటుడు పంకజ్ కపూర్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలోని పలు జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇదే క్రమంలో ఎన్‌ఎస్‌డిలో గడిపిన రోజులను గుర్తుచేసుకుంటూ 1970వ దశకంలో తాను ఎన్‌ఎస్‌డిలో చదువుకునేవాడినని అన్నారు. ఆ సమయంలో ఒక చిన్న బాలుడు తరచుగా క్యాంటీన్‌కు సమోసాలు తీసుకువచ్చేవాడని తెలిపారు. అయితే ఆ బాలుడు మరెవరో కాదు ఇప్పటి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పేర్కొన్నారు.

ఇక షారుఖ్ ఖాన్‌కు ఎన్‌ఎస్‌డీతో చాలా అనుబంధం ఉందని అందరికీ తెలిసిందే. అతని తండ్రి మీర్ తాజ్ మహమ్మద్ ఖాన్ ఢిల్లీలో 'ఖతీర్' అనే రెస్టారెంట్‌ను నడిపేవారు. తన తండ్రి ఎన్‌ఎస్‌డీ మెస్ క్యాంటీన్ సంబంధిత కార్యకలాపాలలో పాలుపంచుకునేవారని షారుఖ్ పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఈ కారణంగానే, షారుఖ్‌కు చిన్నతనం నుంచే నటన తో పాటు సినిమాలపై కూడా ఆసక్తి పెరిగిందని అంటుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+