సాకిన బిడ్డకు సమాన ఆస్తి? తాతల నాటి ఆస్తులు.. కోర్టు తీర్పులు!

ఇంటి బిడ్డగా పెరిగి, అన్ని బాధ్యతలు మోసి, సమాజం దృష్టిలో కొడుకుగానో, కూతురుగానో చలామణీ అయిన వ్యక్తికి.. ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన DNA టెస్టులో తల్లిదండ్రులతో ఎలాంటి రక్తసంబంధం లేదని తేలితే? ఆస్తి హక్కుల విషయంలో ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? భావోద్వేగాలకు విలువ ఇస్తుందా లేక కేవలం కాగితాలనే నమ్ముతుందా?

చాలా ఏళ్లుగా ఒక బిడ్డను సొంత పిల్లల కంటే ప్రేమగా పెంచి, చదివించి, పెద్ద చేసి సమాజంలో తమ వారసుడు లేదా వారసురాలుగా పరిచయం చేసినంత మాత్రాన ఆస్తిపై హక్కులు వచ్చేయవు. డీఎన్‌ఏ (DNA) పరీక్షలో తల్లిదండ్రులకు ఆ బిడ్డకు మధ్య ఎలాంటి జన్యుపరమైన (Biological) సంబంధం లేదని తేలితే, కోర్టులు కేవలం సెంటిమెంట్ల ఆధారంగా తీర్పులు ఇవ్వవు. వారసత్వ హక్కు అనేది కేవలం చట్టపరమైన హోదా (Legal Status) పైనే ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. చట్టబద్ధంగా దత్తత తీసుకోకుండా, కేవలం 'సాకారు' కదా అని ఆస్తిపై హక్కులు అడగలేరు.

చట్టబద్ధమైన దత్తత (Valid Adoption) ఉంటేనే

హిందూ దత్తత, పోషణ చట్టం (HAMA), 1956 ప్రకారం.. ఒక బిడ్డను పూర్తి లీగల్ డాక్యుమెంట్లతో, చట్టబద్ధంగా దత్తత తీసుకుంటే, ఆ బిడ్డకు సొంతంగా పుట్టిన పిల్లలతో సమానంగా అన్ని హక్కులు ఉంటాయి. తల్లిదండ్రుల స్వయంగా సంపాదించిన ఆస్తితో పాటు తాతల నాటి తరతరాల (Ancestral) ఆస్తిలోనూ సమాన వాటా దక్కుతుంది. కానీ, ఎలాంటి లీగల్ డాక్యుమెంట్లు లేకుండా, కేవలం పెంచిన పిల్లలు (Foster Children) లేదా సెంటిమెంట్ కోసం తెచ్చుకున్న పిల్లలకు ఎలాంటి ఆటోమేటిక్ వారసత్వ హక్కులు ఉండవు.

Property Rights of Non-Biological Children Can a Child Claims Inheritance If DNA Test Is Negative
కూతురికి తెలియకుండా తండ్రి ఆస్తి అమ్మేస్తే.. కోర్టుకు వెళ్లొచ్చా?
కూతురికి తెలియకుండా తండ్రి ఆస్తి అమ్మేస్తే.. కోర్టుకు వెళ్లొచ్చా?

3 విభిన్న మతాల పర్సనల్ చట్టాలు ఏం చెబుతున్నాయి?

రక్తసంబంధం లేని పిల్లల విషయంలో ఒక్కో మతం ప్రకారం చట్టాలు వేర్వేరుగా ఉన్నాయి:

హిందూ చట్టం:

ఒకవేళ DNA టెస్ట్ నెగెటివ్ వస్తే, ఆ బిడ్డకు తాతల నాటి ఆస్తి (Ancestral Property) లో హక్కు పూర్తిగా కోల్పోతారు. అయితే, పెంచిన తల్లిదండ్రులు తమ స్వార్జిత ఆస్తిని 'విల్లు' (Will) రాసిస్తే తప్ప ఎలాంటి ఆస్తి దక్కదు.

ముస్లిం చట్టం:

ముస్లిం పర్సనల్ లా ప్రకారం దత్తతకు చట్టబద్ధత లేదు. రక్తసంబంధం లేని పెంచిన బిడ్డకు ఒక వ్యక్తి తన ఆస్తిలో కేవలం మూడో వంతు (1/3rd) మాత్రమే విల్లు ద్వారా ఇవ్వగలడు. మిగిలిన రెండు వంతుల ఆస్తి కచ్చితంగా రక్తసంబంధీకులకే వెళ్తుంది.

క్రిస్టియన్, పార్శీ చట్టాలు:

కేవలం సాకడం వల్ల హక్కులు రావు. అయితే, వీరు 'జువెనైల్ జస్టిస్ యాక్ట్' కింద దత్తత తీసుకోవచ్చు లేదా 'విల్లు' రాసి తమ 100 శాతం ఆస్తిని కూడా రక్తసంబంధం లేని పెంచిన బిడ్డకు రాసివ్వవచ్చు.

తల్లి రాసిన వీలునామా చెల్లదు? రూల్స్ ఇవే..
తల్లి రాసిన వీలునామా చెల్లదు? రూల్స్ ఇవే..

కోర్టులు ఎలాంటి ఆధారాలను పరిశీలిస్తాయి?

ఆస్తి వివాదం కోర్టుకు చేరినప్పుడు కేవలం డిఎన్‌ఏ నివేదికను మాత్రమే కాకుండా, కొన్ని పరిస్థితులను కూడా కోర్టులు పరిశీలిస్తాయి:

  • బిడ్డ పుట్టిన సర్టిఫికేట్, స్కూల్ రికార్డుల్లో ఎవరి పేరుంది?
  • ఆ బిడ్డ చదువు, పెంపకానికి సంబంధించిన ఖర్చులను ఎవరు భరించారు?
  • తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లు, ఇన్వెస్ట్‌మెంట్లలో ఆ బిడ్డను 'నామినీ'గా పెట్టారా?
  • తల్లిదండ్రుల తరఫున ఆ బిడ్డ లీగల్ బాధ్యతలు (పవర్ ఆఫ్ అటార్నీ వంటివి) నిర్వర్తించారా?

ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, రక్తసంబంధం (Biological Relationship) పై నేరుగా వివాదం తలెత్తి డిఎన్‌ఏ పరీక్షలో తేడా వస్తే... చట్టబద్ధమైన దత్తత పత్రాలు లేదా తల్లిదండ్రులు రాసిన 'విల్లు' (Will) లేకపోతే పెంచిన పిల్లలు ఆస్తిని కోల్పోయే ప్రమాదం 100 శాతం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+