Moral Stories: ఇద్దరు సోదరులు.. ఒకరు మద్యానికి బానిసై.. మరొకరు వ్యాపారవేత్తగా..

ఒక నగరంలో ఇద్దరు సోదరులు ఉండేవారు. వారిలో ఒకరు ఆ నగరంలోనే పేరొందిన గొప్ప వ్యాపారవేత్తగా ఉన్నాడు. మరొకరు మద్యానికి బానిసయ్యాడు. అలా మద్యం మత్తులో ఎల్లప్పుడూ ఇతరులతో గొడవలు పడుతూ ఉండేవాడు. వాళ్లిద్దరూ సొంత అన్నాతమ్ముళ్లు. ఒకే ఇంట్లో పెరిగారు. ఒకే విద్యను అభ్యసించారు. కానీ వాళ్లిద్దరి మధ్య ఇంతటి వ్యత్యాసం ఎందుకు వచ్చిందో పక్కనవారికి అర్థం అయ్యేది కాదు. అయితే ఇందుకు గల కారణాలను తెలుసుకోవాలని కొందరు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వాళ్ల ఇంటికి వెళ్లారు.

తొలుత ఓ వ్యక్తి ఆ ఇంటి తలుపు తీశాడు. ఆ వ్యక్తి పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు. అయితే వాళ్లు అతని దగ్గరకు వెళ్లి ఇలా అడిగారు.."సోదరా.. మీరు ఇలా మద్యానికి బానిస కావడానికి కారణం ఏంటి..? రోజూ మద్యం తాగి మీ భార్యాపిల్లలను ఇలా హింసించడానికి గల కారణం చెప్పండి.. అని అడిగారు. దానికి ఆ వ్యక్తి 'మా నాన్న' అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు వాళ్లు.. మీ నాన్నా..? ఆయనకు దీనికి ఏంటి సంబంధం..' అని ఆశ్చర్యంతో అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి అవును.. " మా నాన్న కూడా మద్యానికి బానిసయ్యాడు. ఆయన ఎప్పుడూ మద్యం సేవిస్తూ మా అమ్మను.. మమ్మల్ని కొట్టేవాడు. చిన్నప్పటి నుంచి నేను ఇదంతా చూస్తూ పెరిగాను. అలాంటి తండ్రికి జన్మించిన నేను ఇంకెలా ఉంటాను" అని తెలిపాడు.

అతని సమాధానం విన్న వ్యక్తులు మరో సోదరుడి దగ్గరకు వెళ్లారు. అతనిని కూడా ఇదే ప్రశ్న అడిగారు.. " మీరు ఈ నగరంలో గొప్ప వ్యాపారవేత్త. అందరూ మిమ్మల్ని గౌరవిస్తుంటారు. మీ విజయానికి గల కారణం ఏంటి?" అని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి 'మా నాన్న' అని సమాధానం చెప్తాడు. అదెలా అని వాళ్లు ఆశ్చర్యంగా అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి.." మా నాన్న మద్యానికి బానిసై రోజూ మమ్మల్ని కొట్టేవాడు. మా అమ్మను హింసించేవాడు. చిన్నప్పుడు నేను ఇదంతా మౌనంగా గమనించేవాడిని. అప్పుడే నిర్ణయించుకున్నాను. నేను మా నాన్నలా అవ్వకూడదని.. సమాజంలో మంచి వ్యక్తిగా.. గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాలని కోరుకున్నాను. నేను అనుకున్నట్లుగానే మంచి వ్యక్తిగా.. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగాను" అని తెలిపాడు.

TwoBrothers The story of two brothers one addicted to alcohol the other a businessman Two Brothers

నీతి: మనం మంచి వ్యక్తిగా మారాలా.. లేక చెడ్డ వ్యక్తిగా మారాలా..? అనేది మనం తీసుకునే నిర్ణయంపైన ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+