పవన్‌పై మాట్లాడొద్దు, కేడర్‌కు వైసీపీ మార్గనిర్దేశం - మారుతున్న లెక్కలు..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి అయిన వేళ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. అటు వైసీపీ సైతం ప్రభుత్వం టార్గెట్ గా రాజకీయ కార్యాచరణ అమలుకు సిద్దమైంది. ఈ సమయంలోనే వైసీపీ నేతల కాపు సమావేశం తరువాత కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కాగా.. డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యల పైన ఎవరూ మాట్లాడవద్దని వైసీపీ తమ కేడర్ కు సూచించటం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కాపు హీట్ మొదలైంది. వైసీపీ కాపు నేతలు తూర్పు గోదావరి జిల్లా రామ చంద్రాపురంలో సమావేశం కావటంతో.. ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. తాజాగా కూటమి కాపు నేతలు వరుసగా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. పవన్ సైతం కాకినాడలో జరిగిన కార్యాక్రమంలో కులాల ప్రస్తావన చేస్తూ చేసిన వ్యాఖ్యలు సైతం వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలోనే వైసీపీ ముఖ్య నేత పేర్ని నాని పార్టీ కేడర్ కు చేసిన సూచన ఆసక్తి కరంగా మారుతోంది.

YSRCP Leader Perni Nani made key directions to the party cadre over Pawan Kalyan latest comments

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆటలో అరటి పండు అని.. ఆయన ఏం మాట్లాడినా వైసీపీ నాయకులు ఎవరూ స్పందించ వద్దని పేర్ని నాని సూచించారు. వైసీపీ లక్ష్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తో పేర్ని నాని స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు. విజయవాడలో సాయిక్రిష్ణ ఎపిసోడ్ లోనూ వైసీపీని కూటమి నేతలు లక్ష్యంగా చేసుకున్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ ఔట్, రాఘవ్ చద్దా..నితీశ్ ఇన్ - భారీ ప్రక్షాళన, ముహూర్తం ఫిక్స్..!!
ధర్మేంద్ర ప్రధాన్ ఔట్, రాఘవ్ చద్దా..నితీశ్ ఇన్ - భారీ ప్రక్షాళన, ముహూర్తం ఫిక్స్..!!

తెర మీదకు కాపు రిజర్వేషన్ల వ్యవహారం..!

కాగా, అటు పవన్ కల్యాణ్ తాజాగా కాకినాడలో మాట్లాడిన వ్యాఖ్యల పైనా వైసీపీ నేతల్లో చర్చ సాగుతోంది. కూటమి నేతలు ఎలా రియాక్ట్ అయినా.. వైసీపీ కాపు నేతలు తమ సమావేశాలను కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. వచ్చే వారం విశాఖలో.. ఆ తరువాత తిరుపతిలో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇక.. కాపు రిజర్వేషన్ల అంశం మరో సారి చర్చకు వస్తోంది.

జగన్ సీఎం అయిన సమయంలో కాపు రిజర్వేషన్ల గురించి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను అమలు చేస్తుందా అనే చర్చ కూడా తెర మీదకు వస్తోంది. ఈ సమయంలోనే పవన్ గురించి ఎవరూ స్పందించవద్దంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు.. వైసీపీ నేతలు భవిష్యత్ లో తీసుకునే నిర్ణయాల పైన ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+