రొనాల్డో మేజిక్- కరవుదీరా గోల్స్ జాతర

పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రపంచ క్రీడా చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించాడు. ఫిఫా ప్రపంచకప్ టోర్నమెంట్‌లో వరుసగా ఆరు విభిన్న ఎడిషన్లలో గోల్స్ సాధించిన ఏకైక ఫుట్ బాలర్ గా అరుదైన రికార్డును నెలకొల్పాడు. టెక్సాస్ వేదికగా జరిగిన గ్రూప్-కే మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌పై లభించిన అద్భుతమైన గోల్‌తో రొనాల్డో ఈ మైలురాయిని అందుకున్నాడు.

ఈ మ్యాచ్ లో పోర్చుగల్ భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా 5-0 తేడాతో ఉజ్బెకిస్తాన్ ను మట్టికరిపించింది. మొదటి మ్యాచ్ లో డీఆర్ కాంగోతో డ్రా వల్ల ఏర్పడిన లోటును ఇక్కడ భర్తీ చేసుకుంది. కరవుతీరా గోల్స్ సాధించింది పోర్చుగల్. ఈ మ్యాచ్ ప్రారంభమైన ఆరు నిమిషాల్లోనే రొనాల్డో గోల్ సాధించాడు.

Cristiano Ronaldo Portugal Captain Makes FIFA World Cup History 1st to Score 6 Different Tournaments

21 ఏళ్ల వయసులో 2006 ప్రపంచకప్‌లో తన తొలి అంతర్జాతీయ టోర్నీ గోల్‌ను నమోదు చేసిన ఈ సూపర్ స్టార్.. దాదాపు రెండు దశాబ్దాల పాటు నిలకడగా సత్తాచాటుతున్నాడనడానికి ఇదే నిదర్శనం. 41వ ఏట కూడా అదే దూకుడును ప్రదర్శించాడు. వయసు అంకె మాత్రమేనని మరోసారి నిరూపించాడు. తొలి మ్యాచ్ లో గోల్స్ చేయకపోవడం వల్ల వచ్చిన విమర్శలకు తెరదించాడు.

2006లో తన మొదటి గోల్ చేయగా, ఆ తర్వాత 2010, 2014 టోర్నమెంట్లల్లో ఒకటి చొప్పున, 2018లో ఏకంగా నాలుగు గోల్స్ సాధించాడు. 2022 ప్రపంచకప్‌లోనూ ఒక గోల్ నమోదు చేసిన రొనాల్డో.. తాజాగా ఈ ఎడిషన్‌లో రెండు గోల్స్ చేశాడు. వరుసగా ఆరు ఫిఫా ప్రపంచకప్‌లలో స్కోర్ చేసిన ఫుట్‌బాలర్‌గా అవతరించాడు.

తమ మొదటి మ్యాచ్‌లో డీఆర్ కాంగో జట్టుతో 1-1తో డ్రాగా ముగించిన పోర్చుగల్, ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో మైదానంలోకి దిగింది. కీలక మార్పులు చేసింది. గాయం నుంచి తిరిగి కోలుకున్న స్టార్ సెంటర్ బ్యాక్ రూబెన్ డయాస్ పునరాగమనం జట్టుకు మరింత బలాన్ని ఇచ్చింది. టోమాస్ అరౌజో స్థానంలో డయాస్ తుది జట్టులోకి వచ్చారు. అలాగే వింగర్ జోయావో ఫెలిక్స్ కూడా బెర్నార్డో సిల్వా స్థానంలో జట్టులోకి చేరాడు.

మరోవైపు అయిదుమంది డిఫెండర్లతో పటిష్టమైన రక్షణ వ్యూహాన్ని అనుసరించిన ఉజ్బెకిస్తాన్ చివరివరకూ పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైన తర్వాత ఈ మ్యాచ్‌లో పుంజుకోవడానికి ప్రయత్నించిందా టీమ్. రొనాల్డో సృష్టించిన మ్యాజిక్ ముందు ఉజ్బెకిస్తాన్ డిఫెన్స్ నిలవలేకపోయింది. పోర్చుగల్ అటాకింగ్ శైలి మ్యాచ్ అంతటా స్పష్టంగా కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+