ధర్మేంద్ర ప్రధాన్ ఔట్, రాఘవ్ చద్దా..నితీశ్ ఇన్ - భారీ ప్రక్షాళన, ముహూర్తం ఫిక్స్..!!
ప్రధాని మోదీ 4.0 టార్గెట్ గా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం.. పార్టీలో కీలక మార్పులకు సిద్దం అయ్యారు. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటుగా.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 12 మంది మంత్రుల తొలిగింపు దాదాపు ఖరారైంది. ఇద్దరు సీనియర్లకు గవర్నర్ పదవులు ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతిని కలిసిన ప్రధాని.. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన పైన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు వేగవంతం అయింది. మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుని కీలక సమాలోచనలు జరిపారు. మరోవైపు ఇద్దరు కేంద్రమంత్రుల రాజ్యసభ పదవీకాలం ముగిసినా.. వారిని తిరిగి ఎంపిక చేయలేదు. వీరిలో ఒకరు బుధవారం మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఈ నెల 26 లేదా 27న ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు (బుధవారం) జరిగే కేంద్ర క్యాబినెట్ భేటీలో పార్లమెంట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా, కేరళకు చెందిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ బుధవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ పదవీకాలం ఈ నెల 21న ముగిసింది. ఆయనను కేంద్రం తిరిగి నామినేట్ చేయలేదు. మరోవైపు రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ రాజ్యసభ పదవీకాలం కూడా ఈ నెల 21నే ముగియగా.. ఆమెను కూడా రాజ్యసభకు తిరిగి ఎంపిక చేయలేదు.

ఈ వారంలోనే ప్రక్షాళనకు అవకాశం..!
ఇక కేంద్ర రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష మల్హోత్రాను గత నెలలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరికి చాలా కాలం క్రితమే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో మంత్రివర్గంలో మరికొందరికి ఉద్వాసన తప్పదని, చాలా మంది కొత్తవారికి అవకాశాలు కల్పిస్తారని చర్చ జరుగుతోంది. నీట్ పరీక్షలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను సైతం తప్పించనున్నారు. ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా తో పాటుగా బీహార్ మాజీ సీఎం నితీశ్ కేబినెట్ లో చేరనున్నారు. పంజాబ్ లో ఉన్న బీజేపీ చీఫ్ నితీన్ నబీన్ హుటా హుటిన ఢిల్లీ చేరుకున్నారు. మిత్రపక్షాలకు ఈ సారి ప్రాధాన్యత పెరిగేలా మార్పులు ఉంటాయని చెబుతున్నారు. దీంతో.. ఈ రోజు కేంద్ర కేబినెట్ తరువాత కేబినెట్ ప్రక్షాళన పైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications