కేంద్రంపై జెన్ జీలో తీవ్ర వ్యతిరేకత ? అడ్డుకోని ఫేస్ బుక్, ఇన్ స్టాకు సమన్లు..!
నీట్ సహా జాతీయ స్దాయి పోటీ పరీక్షల్లో అక్రమాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పుట్టుక, విద్యార్దుల నిరసనలు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి పరిణామాలు కేంద్రంపై (Centre) సాధారణ ప్రజల్లో వ్యతిరేకత పెంచుతున్నాయా ? ముఖ్యంగా సోషల్ మీడియాను విస్తృతంగా వాడుతున్న జెన్ జీలో ఈ వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోందా ?, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వ్యతిరేకతను అడ్డుకునేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ (Facebook), ఇన్ స్టా గ్రామ్ (Instagram) మాతృసంస్ధ మెటా (Meta) ప్రయత్నించడం లేదా ? దీంతో కేంద్రం మెటాను దారికి తెచ్చుకునేందుకు కీలక అడుగులు వేస్తోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది.
కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో చేపట్టిన నిరసనపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో భారీగా విద్యార్దులు గాయపడ్డారు. ఈ వీడియోలు సోషల్ మీడియాను కమ్మేశాయి. దీంతో ప్రధాని మోడీ (PM Modi) కేబినెట్ భేటీ నిర్వహించి ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉండాలంటూ తన మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం తానే రంగంలోకి దిగి ఇన్ స్టాలో విద్యార్దులను ఉద్దేశించి వీడియోలు చేయడం ప్రారంభించారు. ఇలా చేసిన ఓ వీడియోను ఫేస్ బుక్ తొలగించింది. దీనిపై కేంద్రం భగ్గుమంది. దీంతో మెటా క్షమాపణలు చెప్పింది. అయినా కేంద్రం ఆగ్రహం తగ్గలేదు. ఆరా తీస్తే కేంద్రం ఆగ్రహం వెనుక మరో కీలక కారణం ఉంది.

INTERESTING: Govt has summoned Meta’s head of public policy Joel Kaplan on August 5th. Tech official from Instagram also summoned. Govt to reportedly seek a written apology from Meta for removing PM post addressing students from Facebook. Govt has also reportedly also received…
— Rajdeep Sardesai (@sardesairajdeep) August 4, 2026
అదే ప్రభుత్వ వ్యతిరేకత. కేంద్ర ప్రభుత్వంపై ఈ మధ్య కాలంలో పెరిగిన వ్యతిరేకతకు అద్దం పట్టేలా సోషల్ మీడియాలో వీడియోల సంఖ్య, వాటి తీవ్రత కూడా పెరిగింది. దీన్ని అడ్డుకునేందుకు గతంలోలా మెటా ప్రయత్నించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఇలా విచ్చలవిడిగా వీడియోలు వెల్లువెత్తడం, వాటిని భారీగా యువత లైక్, షేర్ చేయడం జరుగుతోందని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని వీడియోను తొలగించారన్న కారణంతో మెటా పబ్లిక్ పాలసీ విభాగాధిపతి జోయెల్ కాప్లాన్‌కు, ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన మరో అధికారికీ రేపు తమ ముందు హాజరు కావాలని సమన్లు పంపింది. ఇందులో ఫేస్‌బుక్ నుండి విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని చేసిన పోస్ట్‌ను తొలగించినందుకు మెటా నుండి ప్రభుత్వం లిఖితపూర్వక క్షమాపణ కోరనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులకు ఎక్కువ ఆదరణ లభిస్తోందంటూ అందుతున్న ఫిర్యాదులపైనా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications