పవన్ తో వంగవీటి రాధా ఆకస్మిక భేటీ వెనుక..!?

ఏపీలో రాజకీయం ఆసక్తిగా మారుతోంది. స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. వచ్చే వారం స్థానిక పోరు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అటు కూటమి పార్టీలు.. ఇటు వైసీపీ స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు నేతలు కూటమి పార్టీల్లో చేరారు. ఈ సమయంలోనే సీట్ల సర్దుబాటు పైనా చర్చలు సాగుతున్నాయి. కాగా.. ఈ ఎన్నికల వేళ డిప్యూటీ సీఎం పవన్ తో వంగవీటి రాధా భేటీ వెనుక కొత్త చర్చ మొదలైంది.

ఏపీలో స్థానిక ఎన్నికల రాజకీయం కీలక మలుపు తిరుగుతోంది. కూటమి పార్టీల మధ్య సీట్ల షేరింగ్ వ్యవహారంలో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. జనసేన తమకు బలం ఉన్న చోట పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు సమస్య వస్తే ఫ్రెండ్లీ కంటెస్ట్ కు దిగాలని పవన్ నిర్దేశించారు. ఈ నిర్ణయమే ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో పవన్‌ కల్యాణ్‌తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు. మర్యాద పూర్వక భేటీగా జనసేన నేతలు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను ఇరువురూ గుర్తుచేసుకున్నారని... 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో నిర్వహించిన ప్రచారానికి సంబంధించిన పలు అంశాలను కూడా వారు ప్రస్తావించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. భేటీలో సమకాలీన రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది.

 కాకినాడ, నర్సాపురం కు దసరా ప్రత్యేక రైళ్లు - డేట్స్, రూట్, టైమింగ్స్..!!
కాకినాడ, నర్సాపురం కు దసరా ప్రత్యేక రైళ్లు - డేట్స్, రూట్, టైమింగ్స్..!!
vangaveeti-radha-pawan-kalyan-meeting-sparks-speculation-ahead-of-vijayawada-local-body-polls

పవన్- రాధా భేటీ పై కొత్త చర్చ..!

పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖల్లో చేపడుతున్న మార్పులు, సంస్కరణ లను రాధాకృష్ణ అభినందించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే.. విజయవాడ కార్పోరేషన్ మేయర్ పదవి పైన జనసేన ఆశలు పెట్టుకుంది. అటు టీడీపీ నుంచి ముఖ్య నేతలు తమ వారసుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ చేరిన రాధా కు ఎమ్మెల్సీ సీటు పైన హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఇంకా అమలు కాలేదు. ఇప్పుడు పవన్ తో భేటీ వెనుక విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో రాధా పాత్ర గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. బెజవాడ మేయర్ గా రాధా కు ఛాన్స్ దక్కుతుందనే చర్చ కొంత కాలంగా వినిపిస్తోంది. అయితే, రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. పవన్ మద్దతుతో రాధా మేయర్ బరిలోకి దిగే ఛాన్స్ ఉందనే అంచనాలు రాజకీయంగా మొదలయ్యాయి. దీంతో.. బెజవాడ సీటు పొత్తుల లెక్కల్లో భాగంగా ఎవరికి దక్కుతుంది.. రాధా పాత్ర ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+