ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి: రైలు ప్రయాణంలో ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం
రైళ్లలో తోటి ప్రయాణికుల ప్రవర్తన వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, పాటించాల్సిన కనీస ప్రవర్తనపై ఇప్పుడు విస్తృత చర్చ నడుస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. బీజేపీకి చెందిన బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య భార్య, ప్రముఖ కర్ణాటక సంగీత గాయని శివశ్రీ స్కందప్రసాద్ ఎదురైన చేదు అనుభవమే. రైలు ప్రయాణంలో తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలని వ్యాఖ్యానించారు.
రైలు ప్రయాణంలో తనకు ఎదురైన అసౌకర్యంపై శివశ్రీ తన ఎక్స్ పోస్ట్‌లో వివరించారు. కోచ్‌లో మొత్తం 56 సీట్లు ఉండగా, అందులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఒకే బ్యాచ్ కు చెందిన వారని, సుమారు అయిదు గంటల పాటు సాగిన ప్రయాణం అంతా కూడా ఎడతెరిపి లేకుండా గట్టి శబ్దాలు చేస్తూ, గట్టిగట్టిగా మాట్లాడుకుంటూ, అరుస్తూ గడిపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యూనో గేమ్ ఆడుతూ, పెద్ద పెట్టున నవ్వుతూ గోల చేశారని పేర్కొన్నారు.

దీనిపై టీటీఈకి ఫిర్యాదు చేయగా, ఆయన వారించినప్పటికీ ఉపయోగం లేకుండాపోయిందని, ఎందుకు గోల చేస్తున్నారని ప్రశ్నించగా.. నవ్వుతూ మీరు కూడా వచ్చి ఆడండని టీటీఈతో చెప్పడం వారి బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోందని శివశ్రీ పేర్కొన్నారు. వాళ్ల గొడవ వల్ల కోచ్‌లోని ఇతర ప్రయాణికులు ఆ బాధనంతా మౌనంగా ఓర్చుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. బహిరంగ ప్రదేశాలు, ప్రజా రవాణాలో కొందరు వ్యక్తులు తోటి ప్రయాణికులకు కనీస మర్యాద ఇవ్వకపోవడం విచారకరమని, ప్రైవసీని అందరూ ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు.
ఎన్నో ఆలోచనలు మెదులుతుంటాయని, తమకు ప్రశాంతమైన వాతావరణం ఎంతో అవసరమని శివశ్రీ పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తూ తోటి భారతీయులుగా మనం పౌర బాధ్యత (సివిక్ సెన్స్) అనే పరీక్షలో విఫలమయ్యామని అభిప్రాయపడ్డారు. మన దేశంలో ప్రజల ప్రవర్తన ఎప్పుడు మెరుగుపడుతుందని సోషల్ మీడియా ద్వారా ఆమె ప్రశ్నించారు.
తాను శాస్త్రీయ గాయని కావడం వల్ల ఎన్నో ఆలోచనలు మెదులుతుంటాయని, తనలాంటి వారికి ప్రశాంత వాతావరణం ఎంతో అవసరమని శివశ్రీ పేర్కొన్నారు. ప్రయాణాల్లో సృజనాత్మక ఆలోచనలను మెరుగుపరచుకోవడానికి, ఏకాగ్రతకు భంగం కలగకుండా ఉండటానికి కొంతైనా ప్రశాంతత అవసరం ఉంటుందని శివశ్రీ తెలిపారు. తోటి ప్రయాణికుల ఇటువంటి బాధ్యతారహిత్య ప్రవర్తన వల్ల ప్రశాంతంగా ప్రయాణించాలనే తన ఆశలు పూర్తిగా అడియాశలయ్యాయని, కనీస ఏకాగ్రత కుదరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ గందరగోళాన్ని భరించలేక టీటీఈను సంప్రదించి, కోచ్‌ను మార్చాలని అభ్యర్థించినట్లు వెల్లడించారు. మిగిలిన బోగీల్లో సీట్లు ఖాళీగా లేకపోవడంతో అది సాధ్యం కాలేదని, దీంతో మరో దారి మార్గం లేక అయిదు గంటల పాటు ఆ గోలలోనే ప్రయాణించాల్సి వచ్చిందని, వారి అల్లరిని మౌనంగా భరించక తప్పలేదని చెప్పారు. దురదృష్టవశాత్తూ తోటి భారతీయులుగా మనం సివిక్ సెన్స్ అనే పరీక్షలో విఫలం అయ్యామని అభిప్రాయపడ్డారు. దేశంలో ఇటువంటి ప్రవర్తన ఎప్పుడు మెరుగుపడుతుందని అన్నారు.
I had a traumatic train ride today. It is very sad to see how people do not respect public spaces enough. When we are in the public, we should not shout or even talk loudly and disrespect every individual’s personal space in Public. As artists, we have a 100 thoughts running. And…
— Sivasri Skandaprasad 🇮🇳 (@ArtSivasri) September 24, 2026












Click it and Unblock the Notifications
