నమ్మశక్యం కాని క్యాచ్ పట్టిన స్టార్ ఆల్ రౌండర్: దక్షిణాఫ్రికా చేతిలో మట్టికరిచిన ఆస్ట్రేలియా

కింగ్స్‌మీడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అద్భుత విజయాన్ని అందుకుంది. 67 పరుగుల తేడాతో ఆ జట్టును మట్టికరిపించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే కగిసో రబాడ, లుంగీ ఎంగిడి వంటి ఫాస్ట్ బౌలర్లు గాయపడటంతో సఫారీ జట్టు బౌలింగ్ విభాగం పూర్తిగా బలహీనపడిందని అందరూ భావించినప్పటికీ.. ఆ జట్టు ప్లేయర్లు అసాధారణ ఆటతీరును ప్రదర్శించారు. ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోరును సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కె వీరోచిత సెంచరీతో జట్టుకు పటిష్టమైన పునాది వేసింది. ఆల్ రౌండర్ మార్కో జెన్ సెన్ మెరుపు ఇన్నింగ్స్‌.. జట్టు భారీ స్కోర్ సాధించడానికి దోహదపడింది. టాప్ ఆర్డర్ లో కేప్టెన్ టెంబా బావుమా- 30, రియాన్ రికెల్టన్- 27 పరుగులతో ఆస్ట్రేలియా బౌలింగ్ లైన్ పై ఒత్తిడి పెంచాడు.

Matthew Breetzke 112 and Marco Jansen Insane Catch Power South Africa to a 67-Run Victory Australia

ఒక దశలో దక్షిణాఫ్రికా 125 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ టోనీ డిజోర్జీ డకౌట్ అయ్యాడు. క్వింటన్ డికాక్- 14 పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన బ్రీట్జ్కె క్రీజ్ లో కుదురుకున్నాడు. భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బావుమా, రికెల్టన్, మార్కొ జెన్ సెన్ తో కలిసి భారీ ఇన్నింగ్ నిర్మించాడు. జెన్ సెన్ తో కలిసి అయిదో వికెట్‌కు 81 బంతుల్లోనే 107 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

వాస్తు ప్రకారం.. ఇంట్లో అక్వేరియం విషయంలో పాటించాల్సినవి
వాస్తు ప్రకారం.. ఇంట్లో అక్వేరియం విషయంలో పాటించాల్సినవి

ఈ క్రమంలో బ్రీట్జ్కె 106 బంతుల్లో 112 పరుగులు చేసి తన వన్డే కెరీర్‌లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జెన్ సెన్ 59 బంతుల్లో 75 పరుగులతో మెరుపు ఇన్నింగ్ ఆడాడు. వన్డేల్లో అతనికి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా. ఆస్ట్రేలియా బౌలర్లల్లో నాథన్ ఎల్లిస్- 3, ఆడమ్ జంపా- 2, హేజిల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్ లో రెండు రనౌట్లు నమోదయ్యాయి. ఇది ఆ జట్టు భారీ స్కోర్ సాధించడంలో కొంత వరకు కళ్లెం వేసినట్టయింది.

తిరుపతిలో మరో రెండు టీటీడీ భారీ వసతి భవనాలు
తిరుపతిలో మరో రెండు టీటీడీ భారీ వసతి భవనాలు

298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ప్రారంభంలో అదరగొట్టింది. ఓపెనర్లు విధ్వంసకర ఇన్నింగ్ ఆడారు. కేప్టెన్ మిచెల్ మార్ష్ 36 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్- 36, టాప్ ఆర్డర్ బ్యాటర్ కూపర్ కొనొలి- 38 ధాటిగా ఆడాడు. దీంతో మొదటి పవర్‌ప్లే ముగిసేసరికి ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి ఏకంగా 96 పరుగులు చేసింది. మిడిలార్డర్ లో మాట్ రెన్ షా 44 పరుగులతో రాణించడంతో ఆసీస్ గెలుపు ఖాయమనే అనుకున్నారంతా.

ఆ దశలో బౌలర్లు తడాఖా చూపారు. కేశవ్ మహారాజ్.. తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మలుపు తిప్పాడు. మిఛెల్ మార్ష్, కామెరాన్ గ్రీన్, జాక్ ఎడ్వర్డ్స్ ను పెవిలియన్ పంపించి టాప్ ఆర్డర్ వెన్ను విరిచాడు. చివర్లో ఆడమ్ జంపాను అవుట్ చేసి 20 పరుగులకే 4 కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. దీంతో ఆస్ట్రేలియా 230 పరుగులకు ఆలౌట్ అయింది.

మార్కో జెన్ సెన్ పట్టిన సింగిల్ హ్యాండ్ క్యాచ్.. మ్యాచ్ కే హైలైట్‌. ఒంటిచేత్తో పోరాటం చేస్తోన్న ఆసీస్ బ్యాటర్ మాట్ రెన్‌షా కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్ వద్ద అతను అందుకున్న తీరు అద్భుతం. గెరాల్డ్ కొయెట్జే బౌలింగ్ లో మిడాన్ దిశగా గాల్లోకి లేచిన బంతిని బౌండరీ లైన్ వద్ద జిరాఫీలా పరిగెత్తుకుంటూ వచ్చి.. గాల్లోకి ఎగిరి కుడిచేత్తో బంతిని అందుకున్న విధానం విస్మయపరిచింది. జెన్ సెన్.. లెఫ్ట్ హ్యాండర్. అయినప్పటికీ చాలా బ్యాలెన్స్డ్ గా కుడి చేత్తో సింగిల్ హ్యాండ్ క్యాచ్ పట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+