కదిలిన ఖైరతాబాద్ బడా గణేశుడు.. రంగంలోకి 45 వేల మంది పోలీసులు!

హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా, కన్నులపండువగా సాగుతున్నాయి. ప్రసిద్ధి ఖైరతాబాద్‌ బడా గణేశుడి శోభాయాత్ర ఎట్టకేలకు ప్రారంభమైంది. విగ్రహం చుట్టూ అవసరమైన వెల్డింగ్ పనులను పూర్తి చేసిన అనంతరం, బడా గణనాథుడిని ప్రత్యేకంగా సిద్ధం చేసిన టస్కర్‌ వాహనంపైకి ఘనంగా చేర్చారు. సాంకేతిక కారణాల వల్ల శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర కాస్త ఆలస్యంగా కదిలింది. మధ్యాహ్నం 2 గంటలకల్లా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిగా ముగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 5 వద్ద ఈ అద్భుతమైన విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు.

భారీ భద్రతా వలయంగా మారిన హైదరాబాద్ నగరం..

లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. శివారు ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల వరకు నాల్గు కమిషనరేట్ల పరిధిలో అసాధారణ రీతిలో ఏకంగా 45 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఒక్క హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోనే సుమారు వెయ్యి మంది పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధుల్లో కొనసాగుతున్నారు.

Khairatabad Ganesh Shobhayatra Begins As Thousands Of Devotees Gather For Hussain Sagar Immersion
ఖైరతాబాద్​ గణేష్ వద్ద పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడుతున్న క్యూలైన్లు..!
ఖైరతాబాద్​ గణేష్ వద్ద పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడుతున్న క్యూలైన్లు..!

స్వయంగా రంగంలోకి దిగిన సీపీ సజ్జనార్..

నిమజ్జనోత్సవాన్ని అత్యంత ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసేందుకు పోలీస్ శాఖ సర్వశక్తులు ఒడ్డుతోందని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్‌ తెలిపారు. ఖైరతాబాద్ బడా గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లను ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ, విద్యుత్, జలమండలి తదితర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేవలం బందోబస్తు నిమిత్తమే దాదాపు 20 వేల మంది సిబ్బందిని రంగంలోకి దంచినట్లు వెల్లడించారు.

శోభాయాత్రను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నామని, ఊరేగింపు మార్గాల్లోని దాదాపు 10 వేల సీసీ కెమెరాలను బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించి నిఘా ఉంచినట్లు సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు సాగే ప్రధాన శోభాయాత్ర సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నామని, భక్తులు ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

ట్యాంక్ బండ్‌ ‌‌‌పై నిమజ్జనం బంద్.. హుస్సేన్ సాగర్ వద్ద ఆంక్షలు తీవ్రతరం.. ప్రజలు ఆగ్రహం..!
ట్యాంక్ బండ్‌ ‌‌‌పై నిమజ్జనం బంద్.. హుస్సేన్ సాగర్ వద్ద ఆంక్షలు తీవ్రతరం.. ప్రజలు ఆగ్రహం..!

శోభాయాత్రలో ఉత్సాహం నింపిన ప్రజాప్రతినిధులు..

ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్రలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. యాత్ర మధ్యలో ఆయన స్టెప్పులేసి వేడుకల్లో మరింత జోష్ నింపారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల 'గణపతి బప్పా మోరియా' నామస్మరణతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. మంగళ వాయిద్యాల నడుమ సాగుతున్న ఈ అద్భుతమైన ఊరేగింపును తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+