సూపర్ స్ట్రాంగ్ 'ప్రొటీన్ పౌడర్'..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి..!
ఇప్పుడు యువత అంతా బాడీ బిల్డింగ్ మంత్రంగా జపిస్తోంది. రాత్రికి రాత్రే సిక్స్ ప్యాక్ వచ్చేయాలని కసితీరా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కండలు తిరిగిన బాడీ కోసం ప్రొటీన్ పౌడర్ వాడేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ ప్రొటీన్ పౌడర్ అధికంగా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యల ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల కిడ్నీలపై ప్రభావం, జీర్ణ సమస్యలు, విషతుల్యాలతో ప్రభావం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఇంట్లోనే సులభంగా ప్రొటీన్ పౌడర్ ను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
'ప్రొటీన్ పౌడర్' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే బాదం ఒక కప్పు, వేరుశనగలు అర కప్పు, గుమ్మడి గింజలు అర కప్పు, సన్ ఫ్లవర్ గింజలు అర కప్పు, అవిసె గింజలు అరకప్పు, ఓట్స్ అర కప్పు, చియా గింజలు రెండు టేబుల్ స్పూన్ లు తీసుకోవాలి. ఇప్పుడు ప్రొటీన్ పౌడర్ తయారీ విధానం చూస్తే.. ముందుగా గింజలను అలాగే ఓట్స్ ను పొడిగా వేయించుకోవాలి. ఇప్పుడు బాదం, వేరుశనగ, గుమ్మడి, పుచ్చకాయ, సన్ ఫ్లవర్ గింజలు, ఓట్స్ ను మితమైన మంటపై పొడిగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత సువాసన వచ్చేంత వరకూ వేయించుకోవాలి.

ఇప్పుడు వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత వేయించిన పదార్థాలన్నింటినీ ఒక ప్లేట్ లోకి పోసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత చల్లారిన గింజలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని గాజు సీసాలో స్టోరేజ్ చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ అండ్ హెల్దీ ప్రొటీన్ పౌడర్ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications