Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీకెండ్ లో మెయిల్ పంపితే రిజల్ట్ ఇలాగే ఉంటది!

మనదేశంలో ఐటీ ఉద్యోగం అంటే 24/7 అందుబాటులో ఉండాలనేది ఒక రూల్ కానీ రూల్. వారాంతాల్లో (Weekends) కూడా బాస్ నుంచి ఫోన్ వచ్చినా, ఈమెయిల్ వచ్చినా వెంటనే రిప్లై ఇవ్వడం మనకు అలవాటు. కానీ, ఒక ఐటీ ఉద్యోగి ఇండియా నుంచి జర్మనీకి మారిన తర్వాత అతనికి ఎదురైన అనుభవం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పారిశ్రామికవేత్త ఆదిత్య కొండవార్ పంచుకున్న ఈ సంఘటన ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

భారతదేశంలో పనిచేసిన అనుభవంతో, సదరు ఐటీ నిపుణుడు జర్మనీలో కూడా వీకెండ్ లో.. ఆఫీసు ఈమెయిల్‌కు వెంటనే స్పందించాడు. మన దగ్గరైతే ఇలాంటి పనిని 'అంకితభావం' అంటారు. కానీ, అతని జర్మన్ మేనేజర్ మాత్రం వెంటనే అతన్ని తీవ్రంగా మందలించారు. "శని, ఆదివారాల్లో ఆఫీసు మెయిల్స్‌కు ఎందుకు రిప్లై ఇస్తున్నావు? ఆ అవసరం లేదు" అంటూ హెచ్చరించారు. ఒకే కంపెనీలో ఉండి కూడా, దేశాన్ని బట్టి వర్క్ కల్చర్ ఇంత భిన్నంగా ఉంటుందా అని ఆ ఐటీ ఉద్యోగి షాక్ తిన్నాడు.

One Company Two Worlds How an Indian IT Pro s Weekend Work Habit Sparked a Major Controversy in Germany

ఇండియా 'ఆకాంక్ష'.. జర్మనీ 'సమతుల్యత'!

ఈ సంఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "భారతదేశం ఆకాంక్షలకు (Ambition) ప్రాధాన్యత ఇస్తుంది, అందుకే ఎక్కువ పనిగంటలు ఇక్కడ సాధారణం. అదే జర్మనీ లాంటి దేశాలు పని-జీవిత సమతుల్యతకు (Work-Life Balance) పెద్దపీట వేస్తాయి" అని ఒకరు విశ్లేషించారు. వీకెండ్స్ లో పని చేయడాన్ని జర్మనీలో అంకితభావంగా చూడరు చూడరు. అంతే కాదు దానిని ఒక 'నిర్వహణ వైఫల్యం' (Management Failure) కింద జమకడతారు. అంటే, పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయారనేది వారి భావన.

Work చూసే విధానంలోనే తేడా!

యూరోపియన్ దేశాల్లో విశ్రాంతి సమయాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. సోమవారం ఉత్సాహంగా పని చేయాలంటే వీకెండ్‌లో పూర్తి విశ్రాంతి అవసరమని వారు నమ్ముతారు. అదే మన దేశంలో మానవ వనరులు తక్కువ ధరకు, అనంతంగా లభిస్తాయి కాబట్టి, కంపెనీలు ఉద్యోగులను అదనపు గంటలు పనిచేయించుకోవడానికి వెనుకాడవు. "కార్యాచరణను పురోగతిగా పొరబడకండి" (Don't mistake activity for progress) అంటూ కొందరు నిపుణులు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+