The Paradise Twitter Review: నాని 'ది ప్యారడైజ్' ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఏంటి ఇలా ఉంది..!!
నేచురల్ స్టార్ నాని- దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన 'ప్యారడైజ్' మూవీ ప్రీమియర్స్ కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన మూవీ అనేకసార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఇవాళ రాత్రి నుంచే థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేసింది. దాంతో నాని ఫ్యాన్స్ థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆయా షేర్ అంటూ ధూమ్ ధామ్ చేస్తున్నారు. రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో అంచనాలను క్రియేట్ చేసిన మూవీ ఈ మధ్య కాలంలో మరోటి లేదనే చెప్పాలి. రెండు పాటలతోనే ఈ సినిమా హైప్ పీక్స్ చేరడం మామూలు విధ్వంసం కాదు. ట్రైలర్ చూడకుండానే థియేటర్లకు పరుగులు పెడుతున్నారంటే నాని- శ్రీకాంత్ ఓదెల మాస్ కాంబోపై ఉన్న నమ్మకమనే చెప్పాలి. అలాగే అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు కూడా సినిమాకు మేజర్ ఎట్రాక్షన్ కానున్నాయి. పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీకి నైజాంలో టికెట్ ముక్క దొరకడం లేదు. టాక్ బాగుంటే ఆదివారం వరకూ సాధారణ ప్రేక్షకులకు టికెట్లు దొరకడం కష్టంగానే ఉంది.
#TheParadise BLOCKBUSTER 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥💥
— Andhra Talkies (@AndhraTalkie) September 23, 2026
#TheParadise 🔥
— ரோபல்காந்த் (@roflkanth) September 23, 2026
Nani in a completely raw and intense avatar.
Srikanth Odela once again creates a world that feels brutal, dark and deeply rooted.
The scale, visuals, action and Anirudh’s music hit hard. 🔥🔥🔥
But what stands out is the emotion behind the madness.
Not a…
#TheParadise Interval by
— TFI fan (@konchamnavvubro) September 23, 2026
Anirudh × Srikanth Odela
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ఇక ఈ రాత్రికే ప్యారడైజ్ మూవీకి ప్రీమియర్ షోలు పడగా ట్విట్టర్ నుంచి మెల్లగా టాక్ బయటకు వస్తోంది. ఇప్పటి వరకూ అయితే దాదాపు పాజిటివ్ టాకే వినిపిస్తోంది. సినిమాలో నాని, మోహన్ బాబు ఇంట్రో సీన్స్ బాగున్నాయని.. జైలులో ఓ ఫైట్ ను అద్భుతంగా డిజైన్ చేశారని టాక్ వస్తోంది. నాని హీరోయిజంకు మించి మోహన్ బాబు విలనిజం బాగా వచ్చిందని తెలుస్తోంది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు థియేటర్లు ఊగిపోతున్నట్లు సమాచారం. ఫస్టాఫ్ బ్లాక్ బస్టర్ అని ఇంటర్వెల్ బ్యాంగ్ అద్దిరిపోయిందని టాక్ వస్తోంది. అయితే సినిమాలోని పక్కా తెలంగాణ డైలాగ్స్.. ముఖ్యంగా నాని డైలాగ్స్ అర్థం కావట్లేదని మాట్లాడుకుంటున్నారు. సబ్ టైటిల్స్ పెడితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది మాత్రం ఫస్టాఫ్ లో ఆయాషేర్ సాంగ్ తప్పించి ఆశించినంతగా లేదని చెబుతున్నారు. ఇక మరికొద్ది సేపట్లో ఫుల్ రివ్యూ కూడా రానుంది.

ఇక ప్యారడైజ్ మూవీలో నాని సరసన హీరోయిన్ గా కయాదు లోహల్ నటించింది. కయాదు లోహర్ సీన్స్ బాగున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ మూవీలో సికంజా మాలిక్ అనే శక్తివంతమైన విలన్ గా మెప్పించినట్లు సమాచారం. అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి తన తెలంగాణ మాస్ యాక్షన్ మూవీని ప్రెసెంట్ చేశారని తెలుస్తోంది. ఇక నాని తన యాక్టింగ్ తో విశ్వరూపం చూపించారట. రేపటినుంచి ప్రపంచవ్యాప్తంగా జడల్ గాని జమానా స్టార్ట్ కానుంది. మరి ప్యారడైజ్ మూవీ రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డుల్ని కొల్లగొడుతుందో చూడాలి. ఇక ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.












Click it and Unblock the Notifications
