తల్లిని కావాలనుంది.. పెళ్లితో పనేంటీ.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గారాలపట్టిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు శృతిహాసన్. తన నటన, అందంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ఈ ముద్దుగుమ్మ. నటన మాత్రం కాకుండా ఆమె మల్టీటాలెంటెడ్. సంగీతంలోనూ శృతికి పట్టుంది.. సింగర్‌గానూ పలు హిట్ సాంగ్స్ ఆలపించారు. ఇక కమల్ హాసన్ మాదిరిగానే శృతిది విలక్షణమైన వ్యక్తిత్వం. తన భావాలను, అభిప్రాయాలను ఆమె ఏమాత్రం సంకోచించకుండా వ్యక్తపరుస్తుంటారు. 40 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ సింగిల్‌గానే లైఫ్ లీడ్ చేస్తోన్న శృతి.. తాజాగా పెళ్లి, పిల్లలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

తన తండ్రి నటించిన హే రామ్ మూవీలో బాలనటిగా నటించారు శృతిహాసన్. ఆ తర్వాత.. 2009లో హిందీ చిత్రం లక్ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం అనగనగా ఓ ధీరుడు, 7 ఓమ్ అరివు, ఓ మై ఫ్రెండ్ తదితర చిత్రాల్లో నటించినా అవి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఐరన్ లెగ్ ట్యాగ్ వేయించుకున్నారు. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగిన శృతి.. హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్ సింగ్‌తో విజయాన్ని అందుకున్నారు శృతి హాసన్.

shruti

ఆ తర్వాత ఎవడు, రేసు గుర్రం, పూజ, శ్రీమంతుడు, వేదాళం, ప్రేమమ్, సింగమ్ 3, క్రాక్, వకీల్ సాబ్, వీరసింహా రెడ్డి, వాల్తేర్ వీరయ్య, సలార్, కూలీ చిత్రాలతో స్టార్‌డమ్‌ను అందుకున్నారు. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాలలో నటించారు. నటనకే పరిమితం కాకుండా సింగర్‌గా, సంగీత దర్శకురాలిగా తన టాలెంట్ నిరూపించుకున్నారు. ప్రస్తుతం తమిళంలో ట్రైన్... తెలుగులో ఆకాశంలో ఒక తార, సలార్ 2 చిత్రాల్లో శృతి హాసన్ నటిస్తున్నారు.

శృతిహాసన్ ప్రేమాయణాలు, బ్రేకప్ వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. శంతను హాజారికా, సురేష్ రైనా, రణబీర్ కపూర్, ధనుష్, సిద్ధార్థ్‌లతో ఆమె ప్రేమాయణం సాగించినట్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇటలీకి చెందిన మైఖేల్ కోర్సాలే, శంతను హాజారికాలతో మాత్రం తన రిలేషన్‌ను బహిరంగంగానే వెల్లడించారు శృతి. కానీ ఈ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లలేకపోయారు. ఇక ఇటీవల శృతిహాసన్ పెళ్లిపై జోరుగా ఊహాగానాలు వినిపించాయి. కానీ వీటిని ఆమె ఖండించారు. తాజాగా బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ నిర్వహించిన ఆల్ అబౌట్ హర్ అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శృతిహాసన్ మాట్లాడుతూ.. రిలేషన్, పెళ్లి, పిల్లలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైవాహిక బంధాన్ని నేనె ఇష్టపడతా.. అలాగని పెళ్లి పేరుతో బందీ కాలేను. తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. ఆ గుర్తింపును వివాహంతో ముడిపెట్టలేను. అలాగే పెళ్లికి భారీగా ఖర్చు చేయడం ఇష్టం లేదు. అయితే ఎవరి ఇష్టం వారిది.. ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకునే బదులు ఆ సొమ్మును దానధర్మాలు చేయొచ్చు కదా అనేది నా అభిప్రాయం. పెళ్లికి, వివాహ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. నేను కూడా ఓ సారి పెళ్లి పీటల వరకు వెళ్లొచ్చాను. పెళ్లి అంటే కాగితంపై సంతకం చేయడం కాదు. ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజూ అర్ధం చేసుకుంటూ, ఒకరిని మరొకరు ప్రేమించుకుంటూ ఉండటమని శృతి తెలిపారు.

తల్లిగా కావాలని నాకు బలంగా ఉంది.. అయితే అందుకు పెళ్లే చేసుకోవాల్సిన అవసరం లేదు. తల్లిగా మారేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. పెళ్లికాకుండానే సొంతంగా బిడ్డకు తల్లిని కావడంతో పాటు కావాలనుకుంటే బిడ్డను దత్తత తీసుకోవడానికి కూడా తాను సిద్ధమే. ఇటీవల ఓ డాక్టర్‌తో మాట్లాడిన తర్వాత మాతృత్వంపై నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయని శృతి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+