Viral Video: కుప్పకూలిన మిలిటరీ విమానం.. పైలట్స్ ముందుగానే భలే దూకేశారే..!

యూకే కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానం వేల్స్ నగరంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు స్వల్పంగా గాయపడ్డారు. ది హాక్ 2 ఎయిర్ క్రాఫ్ట్ యాంగ్లెసీలోని రాయల్ ఎయిర్ ఫోర్స్ వ్యాలీ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికి ప్రమాదవశాత్తూ వేల్స్ లోని పెన్ కార్నిసియోంగ్ ప్రాంతంలో కుప్పకూలింది. ఆ తర్వాత విమానం మంటల్లో చిక్కుకుని పూర్తి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు పైలట్స్ ను సమీప ఆస్పత్రికి తరలించినట్లు నార్త్ వేల్స్ పోలీసులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీడియోలోని దృశ్యాలను చూస్తే.. విమానం భూమిని ఢీ కొట్టకముందే పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి పారాచూట్స్ సాయంతో విమానం నుంచి కిందకు దూకేశారు. దాంతో వాళ్లు స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం.

RAF training aircraft from UK crashed in Wales Two pilots sustained minor injuries in the accident

ఇక విమానం భూమిని ఢీ కొట్టగానే దట్టమైన పొగ, మంటలు వ్యాప్తి చెందాయి. ఈ మంటల్లో విమానం పూర్తిగా కాలిపోయింది. అయితే విమానం నివాసిత ప్రాంతాలకు దూరంగా కుప్పకూలడంతో భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ ఘటనపై నార్త్ వేల్స్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ స్పందిస్తూ.. మంటలను ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చామని తెలిపింది. అంబులెన్స్ ను వెంటనే ఘటనాస్థలికి తరలించి ప్రమాదంలో గాయపడిన పైలట్స్ ను ఆస్పత్రికి తరలించామని స్పష్టం చేసింది. ఇక ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తును ప్రారంభించినట్లు వివరించింది.

ఈ ఘటనపై డిఫెన్స్ సెక్రటరీ వెస్ స్ట్రీటింగ్ మాట్లాడుతూ.. పైలట్స్ కు మెరుగైన వైద్య సాయం అందిస్తున్నట్లు.. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని వివరించారు. ఇదే ఘటనపై వేల్స్ మినిస్టర్ రూనాప్ లార్వెర్త్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో పైలట్స్ కు ఎలాంటి గాయాలు కాలేదని తెలియడంతో తాను ఊపిరి పీల్చుకున్నానని వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+