"వాళ్లు POK ను శ్మశానంగా మార్చారు".. UNHRC లో పాకిస్థాన్ పై విరుచుకుపడిన కాశ్మీర్ మహిళ

జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లాకు చెందిన మానవ హక్కుల కార్యకర్త తస్లీమా అఖ్తర్ పాకిస్థాన్ ఆగడాలపై విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) లో పాకిస్థాన్ ఎలాంటి దుర్మార్గాలను పాల్పడిందో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో మాట్లాడుతూ ప్రపంచం ముందు ఉంచారు. పీఓకే ను శ్మశానంగా మార్చారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న పౌరులను నిర్దాక్షిణ్యంగా హతమార్చారని ఈ దారుణాలకు సంబంధించిన ఇండిపెండెంట్ విచారణ జరపాలని కోరారు. అలాగే పీఓకే ను ఆజాద్ కాశ్మీర్ గా అభివర్ణిస్తున్న పాకిస్థాన్ వాదనను తప్పుబట్టారు. జెనీవాలో జరిగిన 63 వ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశాల్లో పాల్గొన్న మానవ హక్కుల కార్యకర్త తస్లీమా అఖ్తర్ ఈ మేరకు పాకిస్థాన్ ఆగడాలను ప్రపంచం ముందు ఎండగట్టారు. పీఓకేలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస హక్కుల కోసం ప్రశ్నించినందుకు ప్రజల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చేస్తున్నారని మండిపడ్డారు.

పీఓకే లో జరుగుతున్న ఈ దారుణాలపై ఇండిపెండెంట్ గా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని.. వాస్తవాలను ప్రపంచం ముందు పెట్టాలని తెలిపారు. పీఓకేలో ఆర్థిక వ్యవస్థ విఫలం, గవర్నెన్స్ లో సమస్యలపై జాయింట్ అవామీ గ్రూప్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూప్ ఆధ్వర్యంలో శాంతియుత వాతావరణంలో చేస్తున్న నిరసనల్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఉక్కుపాదంతో తొక్కేసిందని మండిపడ్డారు. " పాకిస్థాన్ ప్రభుత్వం.. వందలమంది ఉద్యమకారులను అరెస్ట్ చేసింది. కీలకమైన నేతలను నిర్బంధించింది. ఇంటర్నెట్ ను షట్ డౌన్ చేసింది. అలాగే డజన్లకొద్దీ పౌరుల ప్రాణాలను తీసింది" అని తస్లీమా అఖ్తర్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. పీఓకేలో ప్రజా పాలన, కమ్యూనికేషన్ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.

TasleemaAkhtar activist lashes out at Pakistan at the UNHRC They have turned PoK into a graveyard

ఇక ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో పాకిస్థాన్ పై ప్రసంగించిన అనంతరం ఓ ఇంగ్లీష్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తస్లీమా అఖ్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే ను ఆజాద్ కాశ్మీర్ అని పాకిస్థాన్ పదే పదే ప్రస్తావించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పాకిస్థాన్ మాట్లాడుతున్న అతిపెద్ద అబద్ధం ఇదేనని స్పష్టం చేశారు. అదే నిజమైతే ఏ దేశ ప్రభుత్వం కూడా తమ సొంత మనుషుల్ని ఎలాంటి కారణం లేకుండా చంపేయడం చేయదని ఎద్దేవా చేశారు. కాశ్మీరీల ప్రయోజనాల కోసం పాకిస్థాన్ ఏనాడు పాటుపడలేదని గుర్తు చేశారు. " జమ్మూ కాశ్మీర్ లోకి తొలుత టెర్రరిస్టులను ఉసిగొల్పి ఆ ప్రాంతాన్ని శ్మశానంగా మార్చారని.. ఇప్పుడు పీఓజేకే నూ శ్మశానంగా మార్చుతున్నారు" అని తస్లీమా అఖ్తర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+