Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Salary Hike: ఐటీ ఉద్యోగులకు షాక్, ఈ సారి డౌటే!

ఐటీ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ల విషయంలో చిన్న షాక్ ఇవ్వొచ్చని సంకేతాలు వినిపిస్తున్నాయి. కొత్త లేబర్ కోడ్‌లు అమల్లోకి రావడంతో కంపెనీల ఖర్చులు ఒక్కసారిగా పెరిగాయి. ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఓవర్‌టైం, బోనస్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి ప్రయోజనాలు విస్తరించడంతో వేతన బిల్లులపై అదనపు భారం పడుతోంది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉన్న ఐటీ సంస్థలు ఈ మార్పుల ప్రభావాన్ని ఇప్పటికే తమ లాభాల్లో చూడడం ప్రారంభించాయి.

నవంబర్ 2025 నుంచి అమలులోకి వచ్చిన కార్మిక సంస్కరణల కారణంగా కంపెనీలు ఒకేసారి భారీ కేటాయింపులు చేయాల్సి వచ్చింది. అమలు వ్యయాలు, నిబంధనల ప్రకారం పెరిగిన బాధ్యతలు కలిపి గత త్రైమాసిక ఫలితాల్లో కొంత ఒత్తిడిని చూపించాయి. లాభాల మార్జిన్లు కుదించబడటంతో, రాబోయే సంవత్సరంలో వేతన పెంపులపై సంస్థలు జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

New Labour Codes Implementation May Slow Down IT Salary Hikes in 2026 Despite Increased Employee Benefits

Salary Hike అందరిపై ఒకేలా ఉంటుందా?

అయితే అందరికీ ఒకేలా ప్రభావం ఉంటుందని చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న నైపుణ్యాలు, కీలక బాధ్యతలు నిర్వహించే ఉద్యోగులకు కంపెనీలు హైక్ తగ్గించే అవకాశం తక్కువ. ఎందుకంటే వేతన వృద్ధి అనేది కేవలం నిబంధనల వ్యయాలపై కాదు; టాలెంట్‌కు ఉన్న డిమాండ్, పనితీరు, ఉత్పాదకత వంటి అంశాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. వేతనాలను గణనీయంగా తగ్గిస్తే ఉద్యోగుల వలసలు పెరిగే ప్రమాదం ఉందని సంస్థలు గ్రహిస్తున్నాయి.

కొంత పరిమితం..

అయితే మార్జిన్ల ఒత్తిడితో ఉన్న కొన్ని ఐటీ కంపెనీలు, అలాగే కొన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మాత్రం ఇంక్రిమెంట్లను కొంత పరిమితం చేసే అవకాశముందని అంచనా. ముఖ్యంగా ఉద్యోగుల ఖర్చులు మొత్తం ఆదాయంలో పెద్ద వాటా ఉన్న సంస్థలకు 8-9 శాతం పెంపు కూడా సవాలుగా మారొచ్చు. 2026లో సగటు ఇంక్రిమెంట్ 9 శాతం వరకు ఉండొచ్చని అంచనాలు ఉన్నప్పటికీ, రంగాల వారీగా తేడాలు కనిపించవచ్చు.

ఉద్యోగులతో మంచి బంధం..

ఈ నేపథ్యంలో కంపెనీలు వేతన నిర్మాణాలను పునఃసమీక్షించే పనిలో ఉన్నాయి. అవుట్‌సోర్సింగ్, ఆటోమేషన్, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై మళ్లీ ఆలోచిస్తున్నాయి. ఉద్యోగులతో మంచి బంధం కొనసాగించడం కూడా సంస్థలకు కీలకం. కాబట్టి పూర్తిగా పెంపులు నిలిపివేయడం కన్నా, మార్కెట్ పరిస్థితులను బట్టి సమతుల్య నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.

మొత్తానికి, కొత్త లేబర్ కోడ్‌లు ఉద్యోగులకు ప్రయోజనాలు తీసుకొచ్చినా, ఐటీ రంగంలో ఇంక్రిమెంట్ల వేగంపై మాత్రం కొంత ప్రభావం చూపే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+