ఇవాళ స్కూళ్లకు సెలవు: విరుచుకుపడుతున్న వర్షాలు, సీఎం కీలక ఆదేశాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో వాయుగుండం తీరం దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సీఎంకు నివేదించారు. ఈ నేపథ్యంలో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా చిన్నపాటి ప్రాణనష్టం కూడా జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Heavy Rain Warning CM Chandrababu Naidu Orders Holiday for Schools Directs Collectors to Stay Alert

వరద ముప్పు తీవ్రంగా ఉన్నందున రిజర్వాయర్లు, నదుల్లోకి వచ్చే ఇన్ ఫ్లోను ఎప్పటికప్పుడు సరిగ్గా అంచనా వేస్తూ క్షేత్రస్థాయి వరకు సమాచారం చేరవేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తీరం దాటిన తర్వాతి రోజుల్లో వర్ష ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, సెప్టెంబర్ 24, 25 తేదీల్లో కలెక్టర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

అర్ధరాత్రి తీరం దాటిన తీవ్ర వాయుగుండం! 48 గంటలు డేంజర్ బెల్స్
అర్ధరాత్రి తీరం దాటిన తీవ్ర వాయుగుండం! 48 గంటలు డేంజర్ బెల్స్

వర్ష తీవ్రత రీత్యా ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవు ప్రకటించాలని ఆదేశించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో వర్షాల వల్ల కొంతమేర వరి పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని, ఎంత విస్తీర్ణంలో నష్టం జరిగిందో వెంటనే అంచనా వేయాలని సూచించారు.

బాధిత ప్రాంతాల్లోని ప్రజలకు తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు నిరంతరం అందేలా చూడాలని, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ సురక్షితంగా ఒడ్డుకు రప్పించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

అనూహ్యంగా వేగం పుంజుకున్న తుఫాన్.. పెను విధ్వంసం తప్పదా?
అనూహ్యంగా వేగం పుంజుకున్న తుఫాన్.. పెను విధ్వంసం తప్పదా?

ఈ టెలీకాన్ఫరెన్స్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఆయా జిల్లాల్లో నమోదైన వర్షపాతం, చేపట్టిన చర్యలపై వివరాలను సీఎం సేకరించి, అధికారులకు తగిన దిశానిర్దేశం చేశారు. ప్రజలకు తక్షణ సాయం అందించేందుకు విపత్తుల నిర్వహణ సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు.. సమాచారం కోసం 112, 1070, 1800-425-0101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+