ధృతి యోగం, బుధాదిత్య యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!
సెప్టెంబర్ 24 2026 గురువారం జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం, గ్రహాల స్థితి కారణంగా ధృతి యోగం, పారిజాత యోగం, బుధాదిత్య యోగం వంటి శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాల కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంటే మరికొన్ని రాశుల వారు మిశ్రమ ఫలితాలను, కొందరు ప్రతికూల ఫలితాలను చూస్తున్నారు. నేడు ద్వాదశ రాశులవారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
మేషం: మేషరాశి జాతకులకు నేడు కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. ఎప్పటి నుండో వసూలు కాని బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
వృషభం: వృషభ రాశి జాతకులకు నేడు కుటుంబ ప్రణాళికలకు మంచి రోజుగా కనిపిస్తుంది. పాత కస్టమర్ల నుంచి లాభం వస్తుంది. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది.
మిథునం: మిథున రాశి జాతకులకు పనిలో కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

కర్కాటకం: కర్కాటక రాశి జాతకులకు కుటుంబ సహకారం ఉంటుంది. వ్యాపారంలో సాధారణ ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా నియంత్రణ అవసరం.
సింహం: సింహరాశి జాతకులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు రావచ్చు. సింహరాశి వారి ఆరోగ్యం బాగుంటుంది.
కన్య: కన్యా రాశి జాతకులకు ఎప్పటి నుండో వసూలు కాని డబ్బు తిరిగి రావడానికి అవకాశం ఉంది. పనిలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
తుల: తులా రాశి జాతకులకు సంబంధాల్లో సానుకూలత ఉంటుంది. వ్యాపారంలో నెమ్మదిగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది.
వృశ్చికం: వృశ్చిక రాశి జాతకులకు పనిలో మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబంలో సహకారం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
ధనుస్సు: ధనుస్సు రాశి వారికి పెద్ద లాభాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. నేడు వీరికి అదృష్టం కలిసి వస్తుంది.
మకరం: మకర రాశి జాతకులకు స్థిరత్వం ఉంటుంది. కొత్త ప్లాన్లు ఆలోచిస్తే మంచిది. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి .
కుంభం: కుంభ రాశి జాతకులకు చంద్రుడు-రాహు దోషం ఉన్నా సాధారణ ఫలితాలు వస్తాయి. నేడు సహనం అవసరంగా కనిపిస్తుంది.
మీనం: మీనరాశి వారికి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications
