పదో తరగతి పరీక్షల వేళ విద్యార్ధులకు బిగ్ రిలీఫ్, విద్యా శాఖ కీలక సూచనలు..!!

పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంగా అధికారులు కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా విద్యార్ధులకు సూచనలు చేసారు. పరీక్షా కేంద్రాలకు కనీసం అరగంట ముందుగానే చేరుకోవాలని పేర్కొన్నారు. అదే విధంగా నమూనా OMR షీట్లు, జవాబు పత్రాల ఫార్మాట్‌ను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

తెలంగాణలో పదో తరగతి పరీక్షల వేళ విద్యా శాఖ అధికారులు కీలక సూచనలు చేసారు. విద్యార్ధు లు జవాబు పత్రానికి OMR షీట్‌ను జత చేయాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2,676 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉదమం 8.30 గంటలకు చేరుకోవాలి. ఇంటర్‌ పరీక్షల మాదిరి పదో తరగతి పరీక్షలకు 5 నిమిషాల గ్రేస్‌ టైం ఉంటుంది. ఉదయం 9.35 తర్వాత విద్యార్ధులకు పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.

tenth-class-public-examinations-are-set-to-commence-on-14-march-to-16-april-with-government-making

విద్యార్ధులకు కీలక సూచనలు

విద్యార్థులు కేవలం పరీక్ష ప్యాడ్‌, హాల్‌టికెట్‌, పెన్ను, పెన్సిల్‌ మాత్రమే తీసుకెళ్లాలి. పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలతోపాటు ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీ చేస్తారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పరీక్షలు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు. మరో వైపు విద్యార్థులు తమ హాల్‌టికెట్లను www.bse.telangana.gov.inలో డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రిన్సిపల్ సంతకం లేనప్పటికీ పరీక్షలకు నేరుగా హాజరయ్యే అవకాశం కల్పించారు. పరీక్షల నిర్వహణ, ఇతర అంశాలపై ఫిర్యాదు చేసేందుకు 24 గంటలు అందుబాటులో ఉండేలా డీఈవో కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షా విధానంపై అవగాహన పెంచుకోవడానికి వీలుగా తాజాగా నమూనా OMR షీట్లు, జవాబు పత్రాల ఫార్మాట్‌ను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యే ముందు వీటిని పరిశీలించడం ద్వారా సులువుగా పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+