వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో చిక్కుకున్న 12 మంది.. రూ. 36,140 జరిమానా..

వందే భారత్ ఎక్స్ ప్రెస్.. దేశంలో తొలి సెమీ హై స్పీడ్ రైలుగా ప్రసిద్ధి చెందింది. ఈ రైలు గంటకు రూ. 160 నుంచి రూ. 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక రైలు బోగీలన్నింటికీ ఏసీ సదుపాయం ఉంది. మెట్రో రైల్ తరహాలో ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. ఒకసారి ఈ తలుపులు క్లోజ్ అయితే మళ్లీ ఓపెన్ అయ్యేందుకు అవకాశం ఉండదు. కేవలం స్టాప్ ల వద్దే ఈ ఆటోమెటిక్ డోర్లు తెరుచుకుంటాయి. అయితే ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో షాకింగ్ ఘటన జరిగింది. తమ బంధువులను రైలు ఎక్కించేందుకు వచ్చి 12 మంది వందే భారత్ రైలులో చిక్కుకుపోయారు. నవంబర్ 15న వారణాసి- న్యూ దిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఈ ఘటన జరిగింది.

వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ఆటోమెటిక్ డోర్స్ ఉన్నందున తమ బంధువులను రైలు ఎక్కించేందుకు వచ్చిన 12 మంది ఆ రైలులోనే చిక్కుకుపోయారు. వారణాసి నుంచి దిల్లీకి రైలు వెళ్తుండగా ఆ 12 మంది టికెట్ లేకుండా రైలు ఎక్కిన కారణంగా అలాగే టికెట్ ధరతో పాటు జరిమానా కూడా విధించారు. అలా మొత్తం రూ. 36,140 జరిమానా విధించారు రైల్వే అధికారులు. అయితే వాళ్లు తమ బంధువులను సంబంధిత సీట్లలో కూర్చోబెట్టి తిరిగి దిగే లోపు రైలు తలుపులు మూసుకుపోయినట్లు సమాచారం. అయితే డోర్లు తెరవాలని అక్కడి సిబ్బంది వేడుకున్నా వారి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఇక చేసేదేం లేక ఆ 12 మంది రైలులోనే ఉండిపోయారు.

VandeBharat Express shocking incident in Kanpur Fine of 36 140 imposed on 12 people caught Kanpur

అలా చిక్కుకుపోయిన వారిని 150 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వచ్చిన ఎటావా స్టేషన్ లో రైల్వే పోలీసులు దించేశారు. అయితే ఒక్కొక్కరికీ రూ. 3వేలు జరిమానా విధించారు అధికారులు. అలా మొత్తం 12 మందికి రూ. 36,140 జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనతో మరోసారి రైల్వే శాఖ కీలక సూచనలు చేసింది. ప్రయాణికులు సరైన ట్రైన్ టికెట్ లేకుండా రైలులో ప్రయాణించరాదని హెచ్చరించింది. తమ బంధువులను దింపేందుకు వచ్చినవాళ్లు రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్స్ తీసుకోవాలని సూచనలు చేసింది. ఇలా టికెట్ లేకుండా చిక్కుకుపోయిన వారిపై జరిమానాతో పాటు కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+