'వారణాసి' సంచలనం.. రిలీజ్ కు ముందే టాలీవుడ్‌ లో ఆల్‌ టైమ్ రికార్డ్..!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో 'వారణాసి' ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ భారీ చిత్రానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఈ మూవీ విడుదలకు ముందే బిజినెస్ పరంగా సరికొత్త సంచలనాలకు తెరలేపుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులను మైత్రీ మూవీస్ రూ.285 కోట్లకు దక్కించుకున్నట్లు సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. మొత్తం రూ.300 కోట్ల డీల్‌ లో.. రూ.15 కోట్లు రికవరబుల్ అమౌంట్ కాగా.. నికర డీల్ విలువ రూ.285 కోట్లు అని సమాచారం అందుతోంది. ఈ మేరకు సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే బిజినెస్ విషయంలో ఈ ప్రాజెక్ట్ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి బ్రాండ్ వాల్యూ.. మహేష్ బాబు స్టార్‌ డమ్ కారణంగానే ఈ మూవీకి ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందని మాట్లాడుకుంటున్నారు.

Rajamouli Varanasi sensation in the business an alltime record for Tollywood reaching Rs 300 crore

ఇక వారణాసి మూవీ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్రగా కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళీ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అదే విధంగా సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ సైతం ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దుర్గాఆర్ట్స్ బ్యానర్ ​పై సీనియర్ నిర్మాత కే. ఎల్. నారాయణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ దర్శకుడితో పనిచేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగాతో నటిస్తారని సామాజిక మాధ్యమాల్లో టాక్ వస్తున్నప్పటికీ దీనిపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాలేదు. అటు రాజమౌళి కూడా తన తదుపరి ప్రాజెక్ట్ ను ఇంకా ఫైనల్ చేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+