సిగరెట్ తాగుతూ రిసార్ట్‌లో ఎంజాయ్ చేస్తున్న కిమ్.. కూతురు ఏం చేస్తోంది?

ప్రపంచ దేశాలను తన అణు బెదిరింపులతో ఎప్పుడూ టెన్షన్ పెట్టిస్తూ ఉండే ఉత్తరకొరియా సర్వాధికారి కిమ్ జోన్ ఉన్ తాజాగా ఒక రిలాక్స్డ్ మూడ్‌లో కనిపించారు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది కీలక అధికారులతో కలిసి ఆయన విహారయాత్రకు వెళ్లారు. నవంబర్ 15, 16 తేదీల్లో దేశంలోని ప్రఖ్యాత 'సమ్‌జియోన్' పర్వత ప్రాంత పర్యాటక జిల్లాలో కిమ్ దంపతులు పర్యటించారు. ఈ టూర్‌లో కిమ్ జోన్ ఉన్ సరదాగా సిగరెట్ తాగుతూ కనిపించగా, ఆయన గారాల పట్టి జు అవే మాత్రం స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కేవలం విహారయాత్రే కాకుండా, ఆ పర్వత ప్రాంతంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కూడా కిమ్ పరిశీలించారు. సమ్‌జియోన్ ఎయిర్‌పోర్టు పునర్నిర్మాణ పనులు, కొత్తగా మారుతున్న పర్యాటక సదుపాయాలు, ముడుబోంగ్ ప్రాంతంలోని నిర్మాణాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఉత్తరకొరియా అధికారిక చరిత్ర ప్రకారం అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావించే 'మౌంట్ ప్యాక్టు' పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆ ప్రకృతి సౌందర్యాన్ని ప్రశంసించిన కిమ్, అక్కడ చేపట్టిన నిర్మాణ పనులు ఎంతో గొప్పగా ఉన్నాయని కొనియాడారు.

North Korean Leader Kim Jong Un Takes Cigarette Break While Daughter Ju Ae Enjoys Ski Resort Visit
చైనాలో కిమ్ సడెన్ పర్యటన.. ట్రంప్ తో భేటీ వేళ.. కారణం ఏంటి..?
చైనాలో కిమ్ సడెన్ పర్యటన.. ట్రంప్ తో భేటీ వేళ.. కారణం ఏంటి..?

మళ్లీ తెరపైకి కూతురు భవిష్యత్తు చర్చ.. జు అవే అప్పీరెన్స్ వెనుక మర్మమేంటి?

ఈ టూర్‌లో కిమ్ వెంట ఆయన కూతురు జు అవే, సోదరి కిమ్ యో జోంగ్, భార్య రి సోల్ జు కూడా ఉన్నారు. అయితే, ఈ పర్యటనలో కూతురు జు అవే స్కీయింగ్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత కొంతకాలంగా కిమ్ వెంటే ప్రతీ అధికారిక కార్యక్రమానికి, సైనిక తనిఖీలకు ఈ చిన్నారి హాజరవుతూ వస్తోంది. దీంతో భవిష్యత్తులో ఉత్తరకొరియా పగ్పాలు ఈ కూతురికే దక్కుతాయనే ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. అయితే, ఆమెను అధికారిక వారసురాలిగా ప్యాంగాంగ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడా ప్రకటించలేదు.

కిమ్ మృతి? రహస్యంగా మృతదేహాం? ఫోటోలు వైరల్ కావడంతో ఊహించని ట్విస్ట్
కిమ్ మృతి? రహస్యంగా మృతదేహాం? ఫోటోలు వైరల్ కావడంతో ఊహించని ట్విస్ట్

పవిత్ర ప్రాంతంగా భావించే మౌంట్ ప్యాక్టు ప్రాముఖ్యత

ఉత్తరకొరియా అధికారిక సైద్ధాంతిక భావజాలంలో 'మౌంట్ ప్యాక్టు' ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. తమ దేశ వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సుంగ్ ఈ పర్వత ప్రాంతం నుంచే జపాన్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగించారని ఆ దేశం నమ్ముతుంది. అంతేకాకుండా కిమ్ తండ్రి కిమ్ జోన్ ఇల్ కూడా ఇక్కడే జన్మించారని చెబుతారు. ఈ చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాన్ని ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉత్తరకొరియా ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తూ అభివృద్ధి పనులు చేపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+