Road Trips: ఇండియాలోనే టాప్ 5 అద్భుతమైన రోడ్ ట్రిప్స్ ఇవే..!

దేశంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. చాలామంది ఈ ప్రాంతాలను రోడ్ ట్రిప్ ద్వారా కవర్ చేయాలని అనుకుంటూ ఉంటారు. రోడ్ ట్రిప్ అనగానే గుర్తొచ్చేవి కొండలు, అడవులు, అందమైన రహదారులు. ఈ దారుల్లో బైక్ లేదా కారులో వెళ్తుంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. మనదేశంలో ఎన్నో అందమైన రోడ్డు మార్గాలు ఉన్నాయి. వాటిలో కొన్ని అడ్వెంచరస్ గా ఉంటే.. మరికొన్ని ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఇండియాలోని బెస్ట్ రోడ్ ట్రిప్స్ లో మనాలి నుంచి లెహ్ వరకు ఉండే జర్నీ టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఈ యాత్రను మోస్ట్ అడ్వెంచరస్ జర్నీ అలాగే మోస్ట్ మెమోరబుల్ జర్నీగా చెబుతారు. ఇరు ప్రాంతాల మధ్య దూరం సుమారు 450 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రోహ్‌ తాంగ్, బరాలాచా లా, తాంగ్ లాంగ్ లా లాంటి ఎత్తైన పర్వత మార్గాల మీదుగా చివరకు లెహ్ చేరుకుంటారు. ఈ ప్రయాణంలో టూరిస్టులకు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తాయి.

అలాగే ముంబై టూ గోవా రోడ్ ట్రిప్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నారా..? గోవా సముద్ర తీరాన్ని ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఎక్స్ పీరియన్స్ గా చెబుతారు. ముంబై నుంచి గోవా వెళ్లేందుకు పూణె టూ కొల్హాపూర్ మీదుగా చేరుకోవచ్చు. ఇదే అత్యంత వేగవంతమైన మార్గం. ఈ రూట్లలో పన్వేల్, లోనావాలా, సత్రా, కొల్హాపూర్, బెలగాం తదితర స్టాప్స్ ఉంటాయి. మరో రూట్ కూడా ఉంది. అదే కొంకణ్ కోస్టల్ రూట్.. నేవీ ముంబై, రత్నగిరి, సావంత్ వాడి మీదుగా ఈ ప్రయాణం ఉంటుంది.

RoadTrips in India A journey amidst the beauty of nature top 5 spectacular road trips in India

ఇక రాజస్థాన్ రోడ్ ట్రిప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చారిత్రక భవనాలు, కోటలను చూడాలనుకునేవారికి ఇది బెస్ట్ టూరిస్ట్ అనుభవం. జైపూర్ నుంచి జోధ్ పూర్ అలాగే జైసల్మేర్ మీదుగా ఉదయ్ పూర్ వరకు సుమారు 1,120 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయడానికి వీలుంటుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ ప్రాంతాల్లో జర్నీ చేయడం ఉత్తమంగా చెబుతారు.

అలాగే బెంగళూరు నుంచి ఊటీ రోడ్ ట్రిప్ కూడా అద్భుతంగా ఉంటుంది. బెంగళూర్ నుంచి మైసూర్, బందీపూర్ మీదుగా ఊటీకి చేరుకోవచ్చు. లేదా కూర్గ్ కు చేరుకోవచ్చు. ఇరు ప్రాంతాల మధ్య జర్నీ 250 నుంచి 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ట్రిప్ లో రోడ్డుకు ఇరువైపులా దట్టమైన అడవులు, పచ్చని కొండలు, టీ, కాఫీ తోటలు పర్యటకులను కనువిందు చేస్తాయి. వీటితోపాటు గౌహతి నుంచి తవాంగ్ టూర్ కూడా పర్యటకులకు మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. నార్త్ ఈస్ట్ రోడ్ ట్రిప్ అద్భుతంగా ఉండటంతోపాటు మోస్ట్ అడ్వెంచరస్ గానూ ఉంటుంది. వీలుంటే ఈ ప్రాంతాల్లోని రోడ్ ట్రిప్ పై ఓ లుక్కేయండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+