ధోనీ రిటైర్మెంట్ పై జగన్ ఆసక్తికర ట్వీట్..! సీఎస్కేలో కొత్త రోల్ పైనా..!

భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ కూడా అయిన క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్ కు ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్ 2027 సీజన్ లో కచ్చితంగా ఆడి రిటైర్మెంట్ ప్రకటిస్తారని అభిమానులంతా ఆశిస్తున్న వేళ.. వారికి ఇవాళ బ్యాడ్ న్యూస్ చెప్పారు. అయినా సీఎస్కే జట్టుకు మెంటార్ గా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్న ధోనీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే క్రమంలో రాజకీయ నేతలు సైతం ధోనీని ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో జగన్ కూడా దీనిపై ట్వీట్ చేశారు.

Ind Vs NZ Test: న్యూజీలాండ్ తో టెస్టులకు బౌలింగ్ ప్లాన్ మార్పు- గిల్ ప్రకటన..!
Ind Vs NZ Test: న్యూజీలాండ్ తో టెస్టులకు బౌలింగ్ ప్లాన్ మార్పు- గిల్ ప్రకటన..!

ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్, ఆయన ప్రస్ధానం, భవిష్యత్ ప్రయాణంపై ఓ ట్వీట్ చేశారు. ఇందులో జగన్.. రాంచీలోని ఒక సామాన్యమైన ఆరంభం నుండి క్రీడలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఎంఎస్ ధోనీ ప్రయాణం, అసాధారణమైన పట్టుదల, ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వానికి నిదర్శనమంటూ పేర్కొన్నారు. ఆయన క్రియాశీల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్న ఈ తరుణంలో, మనం కేవలం ట్రోఫీలను మాత్రమే కాకుండా, జట్టు అత్యంత క్లిష్ట సమయాల్లో ఒత్తిడిని తట్టుకుని, చిరునవ్వుతో జట్టుకు దిశానిర్దేశం చేస్తూ ధైర్యంగా నిలబడిన లెక్కలేనన్ని సందర్భాలను కూడా స్మరించుకుంటున్నామని తెలిపారు.

YS Jagan Praises MS Dhoni s Cricketing Legacy Wishes Him Luck in New Role as Mentor
వైసీపీలో జగన్ భారీ ప్రక్షాళన ? ముహుర్తం ఖరారు-30-70 మందిపై వేటు?
వైసీపీలో జగన్ భారీ ప్రక్షాళన ? ముహుర్తం ఖరారు-30-70 మందిపై వేటు?

ధోనీ రాబోయే తరాలు పదిలపరుచుకునే ఒక అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన వారసత్వాన్ని వదిలి వెళ్తున్నారని జగన్ మాజీ కెప్టెన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. మెంటర్‌గా ఆయన కొత్త పాత్రలో రాణించాలని, భవిష్యత్తులో అన్ని విధాలా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు. సాధారణంగా క్రీడాకారులు విజయాలు సాధించినప్పుడు వారిని ప్రశంసిస్తూ ట్వీట్లు పెట్టే వైఎస్ జగన్.. ఈసారి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ విషయంలోనూ ప్రశంసలు కురిపిస్తూ పెట్టిన ట్వీట్ వైఎస్సార్సీపీ అభిమానులతో పాటు ధోనీ ఫ్యాన్స్ లోనూ జోష్ నింపేలా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+